బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం..

264
BrahMos
- Advertisement -

ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇండియన్ నేవీ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది.బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం మరోమారు విజయవంతమైంది. ఈసారి బ్రహ్మోస్ క్షిపణిని భారత నేవీకి చెందిన స్టెల్త్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై యుద్ధనౌక నుంచి ప్రయోగించారు. అరేబియా సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్టు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) వెల్లడించింది.

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ భారత సాయుధ దళాల సామర్థ్యాలను అనేక విధాలుగా పెంచుతుంది’ అని డీఆర్‌డీఓ చైర్మన్‌ పేర్కొన్నారు. ఎల్‌ఏసీ వెంట చైనా దురాక్రమణ తర్వాత.. గత 45 రోజుల్లో భారత్ నిర్వహించిన పదో క్షిపణి పరీక్ష ఇది. సెప్టెంబర్ 30న ఒడిశా తీరంలో ఒక పరీక్షా కేంద్రం నుంచి స్వదేశీ బూస్టర్‌తో 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను నాశనం చేయగల బ్రహ్మోస్ మిస్సైల్‌ను పరీక్షించారు.

ఈ ప్రయోగం ఆసాంతం బ్రహ్మోస్ క్షిపణి పనితీరు అద్భుతంగా ఉందని, గాల్లోకి లేచింది మొదలు లక్ష్యాన్ని తాకే వరకు అన్ని దశల్లోనూ ఇది సంతృప్తికర ఫలితాలను ఇచ్చిందని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రహ్మోస్ తాజా వెర్షన్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై భారత యుద్ధనౌకలు కూడా శత్రు భీకర వేదికలు కానున్నాయి. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.

- Advertisement -