లక్ష్మీబాంబ్ నుండి బూర్జ్ ఖలీఫా సాంగ్‌.. వీడియో

46
Burj Khalifa Song

అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం లక్ష్మీబాంబ్. కాంచన ఆధారంగా రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్నిరీమేక్ చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోది. తాజాగా ఈ మూవీ నుండి `బూర్జ్ ఖలీఫా వీడియో సాంగ్‌ విడుదల చేశారు… ఈ పాటని అక్షయ్ కుమార్ – కియారా జంటపై చిత్రీకరించారు. అనార్కలీ తరహా కాస్ట్యూమ్స్ ధరించి హీటెక్కించే అందాలతో కియారా కనిపించబోతోంది. ఈ పాటని దుబాయ్ ఎడారిలో చిత్రీకరించారు. ఎర్రటి ఎండలో హీటెక్కించే అందాలతో చెప్పులు లేకుండా కియారా డ్యాన్స్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హారర్ థ్రిల్లర్ కథాంశంతో కామెడీని మేళవించి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేయగా వైరల్ అయ్యింది. తెలుగు- తమిళ వెర్షన్లకు కొంత భిన్నంగా ఎక్స్ట్రా ఎంటర్ టైన్ మెంట్ ని..హారర్ అంశాలనీ జోడించి తెరకెక్కించడంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Burjkhalifa | Laxmmi Bomb | Akshay Kumar | Kiara Advani | Nikhita Gandhi | Shashi-Dj Khushi | Gagan