తెలంగాణ ఫిష్ హబ్‌గా మారుతోంది- మంత్రి కొప్పుల

192
minister koppula
- Advertisement -

100 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప ఆలోచనా విధానంతో తెలంగాణ ఫిష్ హబ్ గా మారుతోంది మంత్రి కొప్పుల అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్‌లో ఆదివారం 6 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా ఉత్పత్తితో పాటు వినియోగం పెరిగిందన్నారు మంత్రి. గత ప్రభుత్వాలైతే మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదు.. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలను కులవృత్తులను ఆధారపడి బ్రతికేవాళ్లను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను రూపొందించడం జరిగిందని మంత్రి కొప్పుల తెలిపారు.

అలాగే ఈరోజు ధర్మపురి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 92.77 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన చితామణి మిని ట్యాంక్ బండ్, రిటల్ & హోల్ సెల్ చేపల మార్కెట్ ను ప్రారంభించి అనంతరం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 100 శాతం సబ్సిడీపై 6.20 లక్షల చేప పిల్లలను గోదావరి లో విడుదల చేశారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో DCMS ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, MPP చిట్టి బాబు, ZPTC బత్తిని అరుణ, మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ సంగి సత్తమ్మ, మార్కెట్ ఛైర్మన్ అయ్యోరి రాజేష్ మరియు జిల్లా కలెక్టర్ రవి పాల్గొన్నారు.

- Advertisement -