బ్రహ్మానందానికి గిరాకీ లేదు..!

462
Brahmanandam still struggling to get offers
- Advertisement -

బ్రహ్మానందం..సినీ లవర్స్‌కి ఈ టాప్‌ కమేడియన్‌ పేరుని మరో సారి పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఎందుకంటే..బ్రహ్మి కనబడితే చాలు సినిమాకొచ్చిన ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వులతో ఊగిపోవడం ఖాయం.

అసలు బ్రహ్మానందం కోసమే కొంత మంది ప్రేక్షకులు సినిమా ధియేటర్‌లోకి అడుపెడతారంటే..ఖచ్చితంగా నమ్మాల్సిందే. అలాంటి బ్రహ్మానందం ఈ మధ్య  ప్రేక్షకుల కంటికి కనిపించడం కష్టంగానే మారింది. నిజానికి ఈ నవ్వుల బాద్‌షాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గిరాకీ తగ్గిపోయింది.

Brahmanandam still struggling to get offers

ఇన్నట్టుండి బహ్మీ మార్కెట్‌ పడిపోడానికి కారణం ఏంటి? ఇన్నాళ్ళూ మా సినిమాల్లో నటించండి అంటూ..పెద్ద హీరోలు సైతం బహ్మానందం డేట్స్‌ కోసం ఎదుచూసేవారు. ఎందుకంటే  బ్రహ్మీ ఉంటే చాలు సినిమా పక్కా హిట్‌ అని డిసైడైపోయేవారు.

తెలుగు చలనచిత్ర రంగంలో బ్రహ్మానందం కమేడియన్‌గా వేసిన మార్క్‌ ఎప్పటికీ మర్చిపోలేనిది. కానీ…ఏ కమేడియన్‌ , ఏ యాక్టర్ ,కూడా లేనంత బిజీగా ఉన్న బ్రహ్మానందం మార్క్‌ ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడున్న దర్శకనిర్మాతలు, హీరోలు, మాత్రం బ్రహ్మీని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనడంలో తప్పులేదు.

 Brahmanandam still struggling to get offers
అసలు బ్రహ్మానందాన్ని వారంతా పట్టించుకోపోడానికి కారణమేంటి? బ్రహ్మానందం అప్పుడు చేసినట్టు ఇప్పుడు కామెడీ చెయ్యలేకపోతున్నారా..? అంటే…ఏ టైంలోనైనా
ఆడియెన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తగలరు. మరి మనోళ్ళు బ్రహ్మానందాన్ని ఎందుకు పట్టించుకోడం లేదు? అంటే..దానికీ కారణాలున్నాయంటున్నారు. రిల్‌ లైఫ్‌లో బ్రహ్మానందం ప్రేక్షకులను ఎంత నవ్వించినా..షూటింగ్‌ టైంలో మాత్రం బ్రహ్మానందాన్ని పలకరించడానికి కూడా బ్రహ్మీ ఛాన్స్‌ ఇచ్చేవారు కాదట.

అంతేకాకుండా తాను అడిగినంత రెమ్యూనరేషన్‌ ఇచ్చినా.. షూటింగ్‌ స్పాట్‌కి లేట్‌గా రావడం లాంటివి కాస్త విసుగు తెప్పించేవని టాక్‌. దాంతో ఇప్పుడున్న వారంతా కాస్త జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.

Brahmanandam still struggling to get offers

ఇప్పుడు జబర్దస్త్ వంటి కామెడీ షో వచ్చిన తర్వాత కమెడియన్ల సంఖ్య పెరిగి దీంతో బ్రహ్మానందాన్ని భరించలేని వారు అప్‌కమింగ్‌ కమేడియన్స్‌తో హిట్స్‌ కొట్టేస్తున్నారు. దాంతో బ్రహ్మీకి అవకాశాలు తగ్గడం మొదలైంది. ఐతే ఏంటీ…ఫినాన్షియల్‌గా బ్రహ్మానందానికి ఇప్పుడు ఎలాంటి ఢోకా లేదు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ. 360 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది.

అయితే ‘ఆహనా పెళ్ళంట’ సినిమాలో అరగుండుతో గెటప్‌ తో స్టార్ట్‌ అయిన బ్రహ్మానందం కెరీర్‌..ఇప్పటి వరకూ ఎలాంటి డోకా లేకుండా సాగిపోతోంది. చిన్న పాత్రలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్రహ్మానందం తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్ స్థాయికి ఎదిగారు. ఓ సందర్భంలో ఏ కమెడియన్, ఏ యాక్టరూ లేనంత బిజీ బిజీగా బ్రహ్మానందం తన హవా కొనసాగించారు.

 Brahmanandam still struggling to get offers

ఇక బ్రహ్మానందం వద్ద ఖరీదైన ఆడి ఆర్ 8, ఆడి క్యూ 7, మెర్సిడెజ్ బెంజ్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయట. భారీగా స్థిరాస్తులు జూబ్లీహిల్స్‌లోని పోష్ ఏరియాలో బ్రహ్మానందానికి కోట్ల విలువైన ఇల్లు ఉందని, దాంతో పాటు కోట్ల రూపాయల విలువ చేసే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించిన  బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో నటించి ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు.

ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ…హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం స్టైల్. అందరూ ముద్దుగా బ్రహ్మీగా పిలుచుకునే ఈ హాస్య నటుణ్ణి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు సైతం వరించింది. సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలే కాని దశాబ్దాల తరబడి చిత్రసీమలో ఉన్న ఏ నటుడి ఆస్తులయినా కోట్లకు చేరుకుంటాయి. అయితే బ్రహ్మానందం ఆస్తులు 360 కోట్లు అంటూ ఇటీవల ఓ ఇంగ్లిష్ ఛానల్ ఇచ్చిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

- Advertisement -