TTD:వార్షిక బ్రహ్మోత్సవాల బుక్ లెట్‌

21
- Advertisement -

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఫిబ్రవరి 29న ధ్వజారోహణం(మీన‌ల‌గ్నం), మార్చి 4న గరుడ వాహనం, మార్చి 5న స్వర్ణరథం, మార్చి 7న రథోత్సవం, మార్చి 8న చక్రస్నానం నిర్వహిస్తారు.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -