శ్రీదేవికి ముద్దు పెట్టేశాడు..!

229
Boney Kapoor Kissing Sridevi
- Advertisement -

ఇప్పుడు చాలామంది సీనియర్ సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ లోనే తమ ప్రేమానురాగాలను చూపిస్తూ నానా హంగామా చేస్తున్నారు. వారి ముద్దూ ముచ్చట్లు ప్రపంచానికి చూపించడానికి పెద్దగా సిగ్గుపడట్లేదు. అదే ఇప్పుడు ట్రెండ్ అండ్ ఫ్యాషన్ అంటున్నారు.మరి బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోని కపూర్ కూడా.. ఇప్పుడు శ్రీమతి బుగ్గపై ముద్దు పెట్టి తన ప్రేమను తెలిపాడు.

Boney Kapoor Kissing Sridevi

మొదటి భార్యకు విడాకులిచ్చి మరీ హీరోయిన్ శ్రీదేవిని పెళ్ళి చేసుకున్నాడు బోని కపూర్. అప్పట్లో అందరూ శ్రీదేవి వేరే హీరోతో ప్రేమలో ఉంది అనుకున్నారు కాని.. చివరకు బోనితో సెటిల్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కట్ చేస్తే ఇప్పుడు శ్రీదేవి చాలా సమయాల్లో అసలు మొగుడు పక్కన లేకుండా బయటకేరాదు. అది హైదరాబాద్‌లో ఏదన్నా పార్టీ అయినా.. చెన్నయ్ లో షికారు అయినా.. ముంబయిలో ఏదన్నా ఈవెంట్ అయినా.. పక్కనే ఎప్పుడూ బోనీ ఉంటాడంతే. అదిగో మొన్న ఒక దీపావళి పార్టీకి ఇలాగే ఇద్దరూ కలసి వెళ్ళారు. అక్కడ బోని శ్రీమతికి ముద్దు ఇచ్చేశాడు.

భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ శ్రీదేవి. ఒకప్పుడు సూప‌ర్‌స్టార్ స్టేట‌స్‌తో రాణించిన తొలి హీరోయిన్ ఈ అతిలోక సుందరి‌. చాలా కాలం తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ అంటూ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మామ్ అంటూ ప్రేక్షకులను అలరించింది.

- Advertisement -