తెలంగాణలో ప్రజలు బోనాల పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం భాగ్యనగంలో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించగా, ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలను పాటిస్తూ బోనాలు జరుపుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఆదివారం ప్రారభమైన ఆషాఢ బోనాలు వచ్చే నెల 8వ తేదీవరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రజలకు భోనాల శుభాకాంక్షలు తెలిపారు. బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు.తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు. వర్షాలు బాగా కురవాలని,పాడిపంటలు వృద్ధి చెందాలని,అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.