నా బాడీలో దానికి చాలా డబ్బులు ఖర్చు చేశా- శృతి

95
Shruti Haasan

హీరోయిన్ శృతి హాస‌న్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. న‌టిగా, సింగ‌ర్‌గా, మంచి డ్యాన్స‌ర్‌గా శృతి హాస‌న్ అద‌రగొట్టింది. కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న స‌మ‌యంలో ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో ప్రేమలో పడింది. దాంతో కొన్నాళ్లు సినిమాలకు టాటా చెప్పి మైకేల్‌ రిలేషన్‌ షిప్ కొనసాగించింది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. కాగా శృతి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోస్‌,వీడియోలతో ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

అంతేకాదు సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు అభిమానుల‌తో చిట్ చాట్ కూడా చేస్తుంది. ‘మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు చేసింది’ అంటూ తన ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని చెప్పకనే చెప్పింది శృతి. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో శృతి దూసుకుపోతుంది. ఇటీవ‌ల‌ ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’ తదితర సినిమాలతో మంచి హిట్లు అందుకున్న ఈ భామ ప్ర‌స్తుతం ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘బాహుబలి’ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ అనే సినిమాలో న‌టిస్తుంది.