లండన్‌లో ఘనంగా ఎమ్మెల్సీ కవిత బర్త్ డే..

76
- Advertisement -

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజును ఘనంగా నిర్వహించిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్(టాక్). లండన్‌లోని టాక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాక్షురాలు శుష్ముణ రెడ్డి కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి, స్వాతి బుడగం, సుప్రజ పులుసు, పావని కడుదుల, క్రాంతి, స్నేహ, శ్వేతా, మౌనిక, నంతిని, మమతా, హారిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం వివక్ష పూరితంగా కవితపై ఈడీ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ…వీస్టాండ్ విత్ కవిత అక్క అంటూ మద్దతు తెలిపారు.

ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఆడబిడ్డ కవిత మన తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఆదర్శమైన నాయకురాలని, మాలాంటి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచి, మహిళల హక్కులకై పోరాటాం చేస్తున్న ధీర వనితని కొనియాడారు. అలాంటి నాయకురాలి పైన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలని ఎన్నారైలంతా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మా వెంటే ఉంటూ మమల్ని ప్రోత్సహిస్తున్న కవితక్క వెంట మేమంతా ఉన్నామని, “వీ స్టాండ్ విత్ కవిత అక్క” ( #WeStandWithKavithaAkka ) అని మహిళలంతా నినదించారు.

కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ… కవితకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఎలాంటి సమస్యలొచ్చినా దైర్యంగా ఎదుర్కొని నిలబడే శక్తి గల ధీర వనిత కవితని, ఇటీవల ఢిల్లీ వేదిక ద్వారా మహిళా బిల్లుకై చేపట్టిన దీక్షకు ప్రవాసులంతా మద్దత్తు తెలుపుతున్నామని, మా పక్షాన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మహిళా బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి, మహిళా లోకానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తునట్టు సుప్రజ తెలిపారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు చట్ట సభల్లో కూడా న్యాయపరమైన వాటా రావాలని సుప్రజ తెలిపారు. మేమంతా కవితక్క వెంట ఉన్నామని మద్దత్తు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

త్వరలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాలు..

పంజాబ్ మంత్రిని పెళ్లాడనున్న సీనియర్‌ పోలీస్..

పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. నిజమేనా?

- Advertisement -