పంజాబ్‌లోని అమృత్ సర్‌లో బాంబు దాడి కలకలం రేపింది. అమృత్‌సర్ జిల్లా రాజస్సని ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. స్థానిక ఆధ్యాత్మిక మందిరమైన నీరంకరి భవన్ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఇద్దరు దుండగులు నిరంకారీ భవన్ వద్దకు బైక్‌పై చేరుకున్నారని తెలిపారు. అనంతరం ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్న వాళ్లపై బాంబులు విసిరారనీ, నాటు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారని పేర్కొన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు గాలింపును ముమ్మరం చేశామని చెప్పారు.