బాహుబలితో బాలీవుడ్‌ భామ రొమాన్స్‌..

281
Bollywood heroine for Prabhas next movie
- Advertisement -

బాహుబలి-2 సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్న ప్రభాస్‌..తన తదుపరి సినిమాకి కూడా రెడీ అయిపోతున్న విషయం తెలిసిందే. అయితే  ప్రభాస్ – సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళనుంది.  ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు సుజీత్‌.
Bollywood heroine for Prabhas next movie
ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా ఊపందుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్‌ తో రొమాన్స్‌ చేసే బ్యూటీ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  ఈ సినిమాలో టాలీవుడ్‌ కి సంబంధించిన భామ కాకుండా బాలీవుడ్‌ కి సంబంధించిన హీరోయిన్‌ ని తీసుకోవాలనే ఆలోచనలో చిత్రటీం ఉందని టాక్‌.  మరి బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజ్  పెరిగిందనే విషయం గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకేనేమో  దర్శకుడి చూపు  బాలీవుడ్‌ భామల పై పడింది.

అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ..హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.  అందువల్ల  ప్రభాస్‌ కి సెట్  అయ్యేలా.. అందులోనూ బాలీవుడ్‌ లో మాంచి క్రేజ్‌ ఉన్న కుర్ర హీరొ యిన్‌ ను  తీసుకునే దిశగా దర్శకనిర్మాతల ఆలోచనలు ఉన్నాయని  అంటున్నారు. మరి  ఈ బాహుబలి తో రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ ఏ బాలీవుడ్‌ భామకు దక్కుతుందో చూడాలి.

- Advertisement -