ఆశా పరేఖ్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

64
- Advertisement -

మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో దాదా సాహెబ్‌ ఫాల్కే ప్రధానమైనది. ఈ అవార్డును 2020 సంవత్సరానికి గాను ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆశా పరేఖ్‌ ఎంపికైనట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం ప్రకటించారు. 68వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో భాగంగా సెప్టెంబర్‌ 30న కేంద్ర ప్రభుత్వం ఆశాకు అవార్డును ప్రదానం చేయనుంది.

1942 అక్టోబరు 2న గుజరాతి కుటుంబంలో పుట్టిన ఆశా… మా అనే హిందీ సినిమాలో బాల నటిగా తెరంగేట్రం చేశారు. 1959లో వచ్చిన దిల్‌ దేకే దేఖో అనే సినిమా ద్వారా కథానాయికగా మారారు. ఘరానా, జిద్దీ, లవ్‌ ఇన్‌ టోక్యో, తీస్రీ మంజిల్‌ పలు సూపర్‌హిట్‌ చిత్రాల ద్వారా చాలా బిజీగా ఉన్న ఆశా… అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా గుర్తింపు పొందారు.

దర్శకురాలు, నిర్మాతగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఆశాను 1992లో పద్మశ్రీ అవార్డు వరించింది.  1995లో వచ్చిన ఆందోళన్‌ అనే సినిమాలో  నటించారు. చివరిసారిగా 1999లో వచ్చిన సర్‌ ఆంఖో పర్‌ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆశా ఆ తర్వాత నటనకు దూరమయ్యారు.

- Advertisement -