ఆచార్య బాపూజీ పోరాటం మరువలేనిది :మంత్రి కేటీఆర్‌

97
ktr
- Advertisement -

ఆచార్య‌ కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ తెలంగాణ తొలి దశ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేశారని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. బాపూజీ పోరాటాలు మ‌రువ‌లేనివి అని పేర్కొన్నారు. సిరిసిల్ల ప‌ట్ట‌ణంలో మానేరు న‌ది స‌మీపంలోని ఎల్ల‌మ్మ గుడి వ‌ద్ద కొత్త‌గా ఏర్పాటు చేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా బాపూజీకి ఘ‌న నివాళుల‌ర్పించారు.

అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. స్వాతంత్ర్యం రాక ముందే కాదు.. వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలంగాణ ఉద్య‌మంలో బాపూజీ ముందంజ‌లో ఉన్నార‌ని గుర్తు చేశారు. ఉద్యమంలో తానూ పోరాటం చేయడమే కాదు పోరాట యోధులకు సహకారం అందించారని తెలిపారు. అప్పటి ప్రభుత్వం జ‌ల దృశ్యంలో తన ఇంటిని తీసి బయట‌ పడేశారో అక్కడే ప్రభుత్వం 20 అడుగుల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింద‌న్నారు. తెలంగాణ వైతాళికుల గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకే విగ్ర‌హాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు.

మీ ఆశీస్సుల వ‌ల్లే ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందిస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. మీ రుణం తీర్చుకునేందుకే శాశ్వ‌త స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చేస్తున్నామని తెలిపారు. వరంగల్‌లో 1250 ఎకరాలలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్ నిర్మాణం జరుగుతుంద‌ని కేటీఆర్ తెలిపారు. దీని ద్వారా 20 – 30 వేల మందికి ఉపాధి లభించనుంద‌ని పేర్కొన్నారు. నేత‌న్న‌ల సంక్షేమం కోసం రూ. 50 లక్షలు విరాళాలు సేకరించి ఆర్థిక సహాయం అందజేశారు. రూ. 70 కోట్ల బడ్జెట్‌ను రూ. 1200 కోట్లకు పెంచామ‌ని తెలిపారు. కుల‌మ‌తాల‌కు అతీతంగా సీఎం కేసీఆర్ త‌న పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. అన్ని వ‌ర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని తెలిపారు.

- Advertisement -