బాడీ షేమింగ్ గురైన భామలు వీళ్ళే

69
- Advertisement -

హీరోయిన్ అనగానే అందాల సోయగంలా ఉండాలని అనుకుంటారు. కానీ, వాళ్ళు కూడా సాధారణమైన అమ్మాయిలే. వాళ్లకు బాధలు ఉంటాయి, వాళ్ళ అందం పై కూడా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. అలా తమ అందం విషయంలో నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొన్న కొందరు హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. తనకంటూ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఆమె చిన్నతనంలో బాడీ షేమింగ్ కి గురయ్యానని తెలిపింది. “చిన్నప్పటినుంచీ నేను బొద్దుగానే ఉన్నా, ఎవరైనా కామెంట్స్ చేసినా అప్పట్లో పట్టించుకునేదాన్ని కాను.. ఎందుకంటే స్కూల్ లో స్పోర్ట్స్ లో నాదే పై చేయి.. కానీ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ లో చేరాక నన్ను చూసి, కామెంట్స్ చేసేవారు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నానని” సోనాక్షి బాధ పడుతూ చెప్పింది.

ఇంచుమించుగా ఇదే కథ హానీరోజ్‌ ది కూడా. వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. కానీ హానీరోజ్‌ కూడా బాడీ షేమింగ్ కి గురి అయ్యింది. హానీరోజ్‌ కూడా బొద్దుగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెపై చాలా సార్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ లా లేదు అని, హీరోయిన్ తల్లిలా ఉందని చాలా రకాలుగా కామెంట్లు చేశారు. కానీ, హానీరోజ్‌కు ఇప్పుడు కాలం కలిసి వచ్చింది. హానీరోజ్‌కు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నాయి.

గ్లామర్ బ్యూటీ శృతిహాసన్ కూడా కెరీర్ మొదట్లో చాలా విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా శృతిహాసన్ ముక్కు బాగా లావుగా ఉండేది. దాంతో ఆ అంశం పై బాగా నెగిటివ్ గా శృతిహాసన్ ను ట్రోల్ చేశారు. అది ముక్కు లా లేదే, ఏదో చెక్కలా ఉంది అంటూ శృతిహాసన్ పై హేళనగా మాటలు మాట్లాడారు. ఆ తర్వాత శృతిహాసన్ తన ముక్కుకి సర్జరీ చేయించుకుంది. ఉప్పెన సినిమాతో కృతిశెట్టి ఒక్కసారిగా మంచి క్రేజ్ సంపాదించింది. అయితే కృతిశెట్టి మొదట్లో సన్నగా ఉండేది. దాంతో కృతిశెట్టిని కూడా ఆమె స్నేహితులే నెగిటివ్ గా కామెంట్స్ చేసేవారట. కానీ కృతిశెట్టి అవేమీ పట్టించుకోకుండా నటన పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ప్రియమణి, శ్రియా సరన్, తమన్నా ఇలా వీరంతా బాడీ షేమింగ్ బాధితులే.

ఇవి కూడా చదవండి…

పవన్ ఎపిసోడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ లీకులేంటి పుష్ప ?

నా భార్యకు రుణపడి ఉంటా..తలైవా

- Advertisement -