BMC Polls:మహాయుతి సీట్ల పంపకం ఖరారు!

6
- Advertisement -

ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌(బీఎంసీ) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహాయుతి కూటమిలో సీట్ల పంపకంపై చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా BJP–శివసేన మధ్య సీట్ల ఫార్ములా తుది అంకానికి చేరుకుంది.

ఏకనాథ్ శిండే నేతృత్వంలోని శివసేన 90 నుండి 100 సీట్లను డిమాండ్ చేసింది. ముంబైలో కీలక వార్డుల్లో గట్టి సంస్థాగత బలం, కార్యకర్తల శక్తి ఉందని శివసేన వర్గాలు చెబుతున్నాయి. మహాలక్ష్మి, దాదర్, వడాలా, అంధేరీ, తూర్పు ముంబై ప్రాంతాల్లో శివసేన ఆధిపత్యం కొనసాగుతోందని షెండే వర్గం వెల్లడించింది. 2022లో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయినా, ఇరు వర్గాలు ఇప్పుడు బీఎంసీ ఎన్నికల్లో తమ బలం చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి.

BJP అయితే ఈసారి 135 నుండి 140 సీట్లలో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2017 బీఎంసీ ఎన్నికల్లో (227 సీట్లలో) శివసేన 84, BJP 82 సీట్లు గెలిచాయి. అప్పట్లో ఇరు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే తాజాగా మహాయుతి సీట్ల పంపకం దాదాపు ఖరారు అయింది. ముంబై, థానే, నాసిక్, కళ్యాణ్–డోంబివ్లి నగరాల్లో BJP–శివసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, పుణే మరియు పింప్రి–చించ్‌వడ్‌లో BJP మరియు అజిత్ పవార్ నేతృత్వంలోని NCP వేర్వేరుగా పోటీ చేస్తాయి. ఇక్కడ ఇరుపార్టీలకూ సమాన శక్తి ఉండటమే కారణంగా చెప్పబడుతోంది.

నవి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో కూటమి ఇంకా నిర్ణయానికి రాలేదు. ఎక్కడ సఖ్యంగా పోటీ చేయడం సాధ్యంకాకపోతే, “ఫ్రెండ్లీ కాంటెస్ట్‌” కోసం మహాయుతి భాగస్వామ్యాలు సిద్ధమవుతున్నాయి. సీనియర్ నేతలు ఉన్నత స్థాయిలో ఏవైనా విభేదాలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు.

Also Read:ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్

- Advertisement -