రణవీర్ సింగ్ నటించిన బ్లాక్‌బస్టర్ ధురంధర్‌పై హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి. సినిమా 100 కోట్ల రూపాయల మార్క్‌ను మొదటి వారంలోనే దాటినా, హృతిక్ ఇచ్చిన రివ్యూ ఆన్‌లైన్‌లో అభిమానుల మధ్య చిచ్చుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన, ఆత్మపరిశీలనతో కూడిన రివ్యూ పోస్ట్ చేసిన హృతిక్, సినిమా చెప్పే కథన విధానం బాగుందని కితాబిచ్చాడు.
నాకు సినిమా అంటే ఇష్టం. కథలో పూర్తిగా మునిగిపోయి, జీవితాన్ని ఆ కథతో కలిపి అల్లే ఫిల్మ్‌మేకర్లను నేను మెచ్చుకుంటాను. ధురంధర్ అలాంటి సినిమా. అద్భుతమైన కథనం… ఇది నిజమైన సినిమా అని హృతిక్ రాశాడు. అయితే, తనకు సినిమా రాజకీయ దృక్పథం నచ్చలేదని స్పష్టంగా చెప్పిన హృతిక్, దీనితో తన అభినందనలు తగ్గిపోలేదని కూడా పేర్కొన్నాడు. రాజకీయంగా నేను ఏకీభవించకపోయినా, సినీ విద్యార్థిగా నేర్చుకున్న విషయాలను ప్రేమించకుండా ఉండలేను. అద్భుతం అని వ్యాఖ్యానించాడు.
అయిత్ హృతిక్ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఇండియా–పాకిస్థాన్ కథాంశం ఉన్న సినిమా విషయంలో హృతిక్ ‘జాతీయ అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడాడ’ని ఆరోపించారు. మరికొందరు ఆయన వ్యాఖ్యలు తాను ప్రజల్లో ఏర్పరచుకున్న ఇమేజ్‌కు నష్టం చేస్తాయని అన్నారు.
Also Read:ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్

