‘బ్లాక్ టీ’తో ఉపయోగాలు..

292
- Advertisement -

కరోనా తర్వాత ప్రజల ఆరోగ్య విధానంలో ఘణనీయమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆహార అలవాట్లు, వ్యాయామం తప్పనిసరి చేశారు. ఇందులో భాగంగా గ్రీన్, బ్లాక్ టీ వాడకం పెరిగిపోయింది. బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక కప్పు తాగితే ఎంతో మంచిది. ఇది కామెల్లియా సినెసిస్ అనే మొక్క ఆకుల పొడి ద్వారా తయారవుతుంది.

()వెయిట్ లాస్ మధుమేహం, గుండె జబ్బులు, పీసీఓడీ వంటి వాటికి మూలకారణం వెయిట్ లాస్. అయితే రోజుకు ఓ కప్పు బ్లాక్‌ టీ తాగితే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసే బ్యాక్టీరియా పెరగడానికి బ్లాక్‌ టీ దోహదం చేస్తుంది.

()బ్లాక్ టీలో కొవ్వు, కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఈజీగా తగ్గుతాయి.

()బ్రెస్ట్ క్యాన్సర్ ను నయం చేస్తుంది బ్లాక్ టీలో కేంప్‌ఫెరాల్‌ అనే యాంటాక్సిడెంట్‌ ఉంటుంది. ఇది రొమ్ము కేన్సర్‌ ని అడ్డుకోవడంలో బాగా పనిచేస్తుంది.

()డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది బ్లాక్ టీ లో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో పేగులకు సంబంధించిన సమస్యలను ఇది పరిష్కరించగలదు.

() బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉన్నాయి. బ్లాక్ టీ, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించటంలో.సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డీఎల్ స్థాయిలను తగ్గించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

() నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది బ్లాక్ టీ నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇందులో ఉండే కేట్చిన్ నోటి క్యాన్సర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే టానిన్, పాలిఫేనోల్స్ దంతాలను పరిరక్షిస్తాయి. బ్లాక్ టీ తాగితే నోటి దుర్వాసన కూడా రాదు.

() గుండెకు ఎంతో మంచిది గుండె జబ్బులతో బాధపడుతున్న వారు రోజు ఒక కప్పు బ్లాక్ టీ తాగటం చాలా మంచిది.

()ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది బ్లాక్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. బ్లాక్ టీలో ఉన్న ఎమైనో యాసిడ్ ఒత్తిడిని తగ్గిస్తుంది.

()రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బ్లాక్ టీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్లాక్ టీలో ఉన్న టానిన్ శరీరంపై దాడి చేసే పలు వైరస్ లను సమర్థంగా ఎదుర్కొంటుంది. ఇందులో ఉండే కేట్చిన్ కూడా ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. అందువల్ల రోజూ బ్లాక్ టీ తాగడం చాలా మంచిది.

() శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది  నీరు తగ్గిపోతే కిడ్నీలు వ్యర్థాలను సరిగా బయటకు పంపలేవు. ఈ క్రమంలో అవి దెబ్బతింటాయి. కాబట్టి బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఇందుకు బాగా నీరు తాగాలి. అలాగే బ్లాక్ టీ కూడా బాడీనీ హైడ్రెటెడ్ గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది.

 Also Read: నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయా.. !

- Advertisement -