నల్ల ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో!

29
- Advertisement -

సాధారణంగా ఉప్పును వంటింట్లో ఉపయోగిస్తుంటాము. ఉప్పు లేనిదే ఏ వంకటం కూడా రుచిగా అనిపించదు. కూరలో ఉప్పు లేకపోతే ఎన్ని మసాలాలు వేసి గుమగుమలాడే విధంగా చేసిన అదంతా వ్యర్థమే. అందుకే ఉప్పును వంటకాలకు గుండెకాయగా చెబుతుంటారు పెద్దలు. మనం సాధారణంగా వంటల్లో ఉపయోగించే ఉప్పు తెల్లగా ఉంటుంది. అయితే ఉప్పులో మరోరకం కూడా ఉందండోయ్ అదే నల్ల ఉప్పు. దీనిని ఔషధాల తయారీలో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చర్మ సంబంధిత ఔషధల తయారీలోనూ, జుట్టు సంరక్షణకు అయిల్స్ లోనూ ఈ ఉప్పును వాడుతుంటారు. ఇవి మాత్రమే కాకుండా ఈ ఉప్పు ద్వారా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం !

కొందరికి మోకాళ్ళు, మోచేతులు, మెడ భాగాల్లో నల్లటి మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని పోగేట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బేకింగ్ సోడా, ఆలివ్ ఆయిల్ మిశ్రమానికి కొద్దిగా నల్ల ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ఆ భాగాలపై రాసుకుంటే నల్ల మచ్చలు త్వరగా తగ్గిపోతాయి. ఎందుకంటే నల్ల ఉప్పు క్లస్టర్ లాగా పని చేసి అక్కడ పెరుకుపోయిన మురికి తొలగించడంలో సహాయ పడుతుంది. ఇంకా జుట్టు సమస్యలకు కూడా నల్ల ఉప్పు అద్బుతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..

జుట్టు ఎక్కువగా రాలుతున్న, లేదా చుండ్రు వేధిస్తున్న, స్నానం చేసేటప్పుడు కొద్దిగా నల్ల ఉప్పు వేసుకొని తల స్నానం చేస్తే ఆ చుండ్రు సమస్య తగ్గుతుంది, అలాగే జుట్టును కుదుళ్ల దాకా శుభ్రం చేయడంలో నల్ల ఉప్పు సహాయ పడుతుంది. తద్వారా జుట్టు బలం పొందుకుంటుంది. ఇంకా సాధారణంగా మజ్జిగ, పెరుగు, నిమ్మ సోడా.. వంటి వివిధ సలాడ్లలో తెల్ల ఉప్పును ఉపయోగిస్తుంటారు. అయితే తెల్ల ఉప్పు స్థానంలో నల్ల ఉప్పును ఉపయోగించడం వల్ల శరీరానికి ఇంకా మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నల్ల ఉప్పులో ఉండే పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు సమృద్దిగా శరీరానికి అందుతాయట.

గమనిక ; ఈ సమాచారం మీ అవగాహన మేరకు మాత్రమే అందించబడింది. కాబట్టి పై సలహాలు సూచనలు పాటించేముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Also Read:TTD:సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు

- Advertisement -