నల్లవెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలో..!

27
- Advertisement -

సాధారణ వెల్లుల్లి గురించి మనందరికీ తెలుసు. నిత్యం కూరల్లో ఉపయోగిస్తుంటాము. ఇది కూరల రుచిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని కేవలం కూరల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఎన్నో రోగాలను దూరం చేయడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. అయితే వెల్లుల్లితో మరో రకం కూడా ఉంది అదే నల్ల వెల్లుల్లి. దీనిని సాధారణ వెల్లుల్లిని పులియబెట్టడం ద్వారా నల్ల వెల్లుల్లి తయారవుతుంది. దీనిని కూడా కూరల్లోనూ చట్నీల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. సాధారణ వెల్లుల్లితో పోల్చితే నల్ల వెల్లుల్లిలో ఘాటు తక్కువగా ఉంటుంది. ఇక ఆరోగ్య నల్ల వెల్లుల్లి ఎన్నో ప్రయోజనాలను కలిగివుంది. .

శరీరంలో క్యాన్సర్ కారకాలను తగ్గించడంలో నల్లవెల్లుల్లి ఎంతో ఉపయోగ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నల్ల వెల్లుల్లి తినడం ద్వారా బ్లడ్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, వంటివి దరిచేరవట. ఇక కాలేయ సమస్యలను దూరం చేయడంలో కూడా నల్లవెల్లుల్లి ఉపయోగ పడుతుందట. నేటి రోజుల్లో గుండె సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గుండె సమస్యలను ఎదుర్కోవడానికి ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపున నల్లవెల్లుల్లి తింటే మేలని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇక సీజనల్ వ్యాధులను తగ్గించి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అల్జీమర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ నల్లవెల్లుల్లి తినడం అలవాటు చేసుకుంటే మంచిదట. ఇందులోని ఔషధ గుణాలు అల్జీమర్ వ్యాధిని దూరం చేయడంలో సహాయ పడతాయి. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్న నల్ల వెల్లుల్లి తినడం మంచిదేనని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

Also Read:TDP:పొత్తు ఎఫెక్ట్.. ‘లెక్కలు’ ఛేంజ్!

- Advertisement -