కింగ్ మేకర్‌గా మారనున్న దళపతి?

8
- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేడు (మే 4) ఉత్కంఠభరితంగా సాగుతోంది. ద్రవిడ రాజకీయాల కోటలో ఈసారి అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) తొలి ఎన్నికల్లోనే సంచలన ఫలితాలను నమోదు చేస్తోంది.

విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ దాదాపు 80 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే దిశగా సాగుతోంది. విజయ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయ్ ముందంజలో ఉన్నారు. పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి ఈస్ట్ సీట్లలో ఆయన స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతున్నారు.

ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని DMK కూటమికి ఈ ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే DMK ఈసారి చాలా తక్కువ స్థానాల్లో (దాదాపు 40-50) మాత్రమే ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో తొలుత వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎడప్పాడి పళనిస్వామి (EPS) నేతృత్వంలోని AIADMK కూటమి దాదాపు 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటూ గట్టి పోటీనిస్తోంది. బీజేపీతో పొత్తు ఈసారి వారికి కొన్ని పట్టణ ప్రాంతాల్లో ప్లస్ అయినట్లు కనిపిస్తోంది.యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసినట్లుగానే, విజయ్ పార్టీ 100 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ (118 సీట్లు) రాకపోతే, దళపతి విజయ్ కింగ్ మేకర్‌గా మారి తమిళనాడు తదుపరి ప్రభుత్వాన్ని శాసించే అవకాశం ఉంది. తమిళనాడు ఎన్నికల చరిత్రలో దశాబ్దాలుగా ఉన్న DMK-AIADMK ద్వైపాక్షిక పోరుకు విజయ్ చెక్ పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:బెంగాల్ గడ్డపై కమలం జోరు..మమతకు షాక్!

- Advertisement -