BJP:ఏపీలో కూడా ఒంటరి పోరు?

19
- Advertisement -

ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసిన కమలం పార్టీ ఘోరంగా విఫలం అయింది. కేవలం 8 సీట్లు మాత్రమే సొంతం చేసుకొని సింగిల్ డిజిట్ కే పరిమితం అయింది. అయితే ఆ ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో ఇక పొత్తులకు స్వస్తి చెప్పనున్నట్లు ప్రకటించింది బీజేపీ. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పింది. అయితే ఏపీలో మాత్రం ఆ పార్టీ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతున్నప్పటికి.. ఆ పార్టీ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తుండడంతో అసలు కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమితో పొత్తుకు సై అనాలా ? లేదా ఒంటరిగా బరిలోకి దిగలా ? అనే విషయం ఎటు తేల్చుకోలేకున్నారు కమలనాథులు. .

మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటనలో అధికార వైసీపీ అందరికంటే ముందంజలో ఉంది. ఈ సంక్రాంతి తర్వాత టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అసలు కన్ఫ్యూజన్ అంతా బీజేపీలోనే ఉంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏపీలో కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలనే ప్లాన్ తో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేన కూటమిలో కలిస్తే కంప్లీట్ గా టీడీపీ డామినేషన్ కనబరుస్తుందని, అందువల్ల బీజేపీ మరింత నష్టపోయే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారట కాషాయ నేతలు. పైగా తెలంగాణలో కలిసి పోటీ చేసిన జనసేన వల్ల బీజేపీకి ఒరిగిందేమీ లేదు. తద్వారా పొత్తు కంటే ఒంటరి పోరే బెటర్ అని ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఏపీ బీజేపీ పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట. మరి బీజేపీ ఒంటరి పోరు ఆ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

Also Read:న‌టుడు వీర భద్రయ్యకు కాదంబ‌రి కిర‌ణ్ సాయం

- Advertisement -