AAP:మరో నలుగురు అరెస్ట్‌కు రంగం సిద్ధం!

29
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేతలను వరుసగా అరెస్ట్ చేస్తోంది ఈడీ. ఇప్పటికే మనీష్ సిసోడియా జైలులో ఉండగా సీఎం కేజ్రీవాల్‌ను సైతం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం.

ఈ నేపథ్యంలో ఢిల్లీ మంత్రి అతిషి కీలక కామెంట్స్ చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికలకు ముందుకు తనతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తనతో పాటు సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్‌, ఆతిషి, దుర్గేశ్ పాఠ‌క్‌, రాఘ‌వ్ చ‌ద్దాలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ పాల‌న ప‌ట్ల త‌మ‌కు భ‌యం లేద‌ని, ఎంత మందిని అరెస్టు చేసినా త‌మ పోరాటం ఆగ‌దు అని తెలిపారు. ఒకవేళ బీజేపీలో చేరితే త‌న‌ను అరెస్టు చేయ‌బోర‌ని ఓ నేత చెప్పినట్లు మంత్రి ఆతిషి వెల్ల‌డించారు.

Also Read:ఏపీలో ‘పెన్షన్ గోల’..!

- Advertisement -