తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటలని, అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ కంటున్న కలలు అన్నీ ఇన్ని కావు. బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని, రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీగా చేరికలు పెరుగుతాయని, ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని.. అబ్బో ఇలా ఒక్కటేంటి రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్న కహానీలు అన్నీ ఇన్ని కావు. ఇవన్నీ నిజమేనేమో అని భావించిన డిల్లీ పెద్దలు రాష్ట్రనికి వచ్చిన ప్రతిసారి భంగపాటుకు గురవుతున్నారట. అసలు విషయంలోకి వెళితే ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు కమలనాథులు. .
గతంలో బిఆర్ఎస్ లో బలమైన నేతగా ఉన్న ఈటెల రాజేందర్ బిజేపీలో చేరడంతో ఆయన ద్వారా బిఆర్ఎస్ లోని నేతలను లాక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని భావించిన డిల్లీ పెద్దలు ఆయనకు చేరికల కమిటీ చైర్మెన్ పదవిని అప్పగించారు. ఈటెల కూడా మొదటి నుంచి ఊహకందని రీతిలో చేరికలు ఉంటాయని చెబుతూ వస్తున్నారు. కట్ చేస్తే ఒకరిద్దరూ మినహా ఇంతవరకు బిజేపీలో చేరిన వారి సంఖ్యే లేదు. ఆ మద్య మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి, ఇటీవల అదే పార్టీ నుంచి బిజేపీ గూటికి చేరిన ఏలేటి మహేశ్వర రెడ్డి.. తప్పా బిజేపీలో చేరిన వారే లేరు. ఇటీవల బిఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు లతో సంప్రదింపులు జరిపినప్పటికి వాళ్ళు బిజేపీలో చేరడానికి ససేమిరా అన్నారట.
Also Read: KTR:రైతులకు అండగా ప్రభుత్వం
ఇలా అసమ్మతి నేతలు కూడా బిజేపీలో చేరడానికి ఏమాత్రం మొగ్గు చూపకపోతుండడంతో డిల్లీ పెద్దలు.. బండి సంజయ్ మరియు ఈటెల తీరుపై ఫైర్ అవుతున్నారట. నేతలను ఆకర్షించడంలో ఎందుకు విఫలం అవుతున్నారని హెచ్చరిస్తున్నారట ఇటీవల చేవెళ్ళ సభకు వచ్చిన అమిత్ షా కూడా అసంతృప్తిగానే సభ ముగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ఎంతో దూరంలో లేవని పార్టీని బలోపేతం చేయడంలో ఎందుకు నిర్లక్షం వహిస్తున్నారని బండి, ఈటెల కు క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో బిజేపీ బలపడిందని కమలనాథులు చేస్తున్న నానా హంగామా అంతా ఒట్టి తాటాకు చప్పులే అని బిజేపీ అధిష్టానానికి కూడా అర్థమైనట్లే ఉంది.
Also Read: అధైర్య పడొద్దు..ఆదుకుంటాం:రైతులతో హరీశ్