మతతత్వ రాజకీయాలు చేయడంలో కమలం పార్టీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. మతాల మధ్య చిచ్చు పెడుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం బీజేపీకి కొత్తేమీ కాదు. మతాల విషయంలో తెలంగాణలోని పలువురు బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదం అవుతూనే ఉంటాయి., గతంలో బండి సంజయ్ ముస్లింలపై చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా వివాదం అవుతూనే ఉంటాయి. సమయం సందర్భం లేకుండా మత విద్వేషాలు రచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తుంటారు కమలనాథులు. తాజాగా మరోసారి ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరుతో బీజేపీ మత విద్వేషాలకు కేరాఫ్ అడ్రస్ అనే వాదనకు మరింత బలం చేకూరుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. .
కాగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి కొత్తగా గెలిచిన ఎమ్మేల్యేలు డుమ్మా కొట్టారు. దీనికి కారణం ముస్లిం వర్గానికి చెందిన ఏంఐఏం నేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకోవడమే. అక్బరుద్దీన్ ఎదుట తాము ప్రమాణస్వీకారం చేయలేమని రెగ్యులర్ స్పీకర్ వచ్చిన తరువాతే తాము ప్రమాణస్వీకరానికి హాజరవుతామని బీజేపీ ఎమ్మేల్యేలు స్పష్టం చేశారు. దీంతో శాసనసభలో కూడా ఇలా మత రాజకీయాలు అవసరమా అని కమలనాథుల తీరుపై మండి పడుతున్నారు ప్రజలు. బిన్న కులాలు, బిన్న మతాల వారు కలిసి కట్టుగా ప్రజాశ్రేయస్సు కోసం చట్టాల రూపకల్పన చేసే శాసనసభలో ముస్లిం వర్గానికి చెందిన ఒవైసీ ప్రోటెం స్పీకర్ గా ఉంటే తాము హాజరు కామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని బీజేపీ తీరుపై సామాన్యులు వేలెత్తి చూపిస్తున్నారు. మరి ఈ తరహా మతరాజకీయాలు కాషాయ పార్టీకి ఎలాంటి చిక్కులు తెచ్చిపెడతాయో చూడాలి.
Also Read:పిక్ టాక్ : తమన్నా అందాల అరాచకం