పాలమూరులో బీజేపీ కార్యవర్గ సమావేశాలు

28
- Advertisement -

పాలమూరు వేదికగా బీజేపీ రాష్ట్రకార్యవర్గ సమావేశాలు నేటి నుండి జరగనున్నాయి. ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగనుండగా 24న రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితి, పార్టీ కార్యాచరణపై చర్చ జరుగనుంది.

ఫిబ్రవరిలో శక్తికేంద్రం వారీగా నిర్వహించనున్న 9 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పై చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ ప్రవాస్ యోజన,జనవరి 7న నిర్వహించిన అసెంబ్లీ వారిగా పోలింగ్ బూత్ సమ్మేళనాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

జనవరి 27 నిర్వహించనున్న పరీక్షా పై చర్చ జరుగనుంది. ఇక జనవరి 29న మన్‌ కీ బాత్‌ అలాగే పార్టీ నిర్వహించిన ఇతర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. జనవరి 28, 30, 31 తేదీలలో జిల్లా కార్యవర్గ సమావేశాలు, ఫిబ్రవరి 1 నుండి 5 వరకు మండల కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. బాటపట్టనున్నారు.

పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతంచేయడం ఎలా..?, ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి..?, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేయాల్సిన పోరాటాలు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రధాని మోడీని బీజేపీ రాష్ట్ర నేతలు కోరిన నేపథ్యంలో పాలమూరులో జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -