బీజేపీ ” షిండే ” వ్యూహం మళ్ళీ మొదలు!

50
- Advertisement -

అధికారంలో ఉన్న పార్టీలో చీలిక తేవడం, ఆ తరువాత అధికారాన్ని అక్రమంగా లాక్కోవడం బీజేపీ అనుసరిస్తున్న వంగక మార్గం. గత కొన్నాళ్లుగా ఆయా రాష్ట్రాలలో ఇదే విధానాన్ని పాటిస్తూ అక్రమ అధికారాన్ని పొందుతూ వస్తోంది బీజేపీ. ముఖ్యంగా మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ అక్రమమార్గం ఎలా ఉంటుందో అందరికీ తెలిసొచ్చింది. మహారాష్ట్రలో బలమైన శివసేన పార్టీలో ఏక్ నాథ్ షిండే ద్వారా చీలిక ఏర్పరచి, మొత్తం మీద థాక్రే ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని షిండే కు అప్పగించింది కాషాయ అధిష్టానం. అప్పట్లో కమలనాథులు వల్లించిన ఈ అక్రమ వ్యూహంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.

Also read: చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ సొంతం..

అయినప్పటికి మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా షిండే వ్యూహాన్నే అమలు చేస్తామని చెప్పడంతోనే ప్రజాస్వామ్యాన్ని కాలరాసేందుకు బీజేపీ ఏం ఆలోచించడాని అందరికీ అర్థమైంది. ఇక తాజాగా మరోసారి మహారాష్ట్రలో అలాంటి చీలిక తీసుకోచ్చేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శరత్ పవర్ నేతృత్వంలో ఉన్న నేషనలిస్ట్ పార్టీలో చీలిక తెచ్చేందుకు ఆ పార్టీలోని ముఖ్య నేత అయిన అజిత్ పవర్ తో బీజేపీ అధిష్టానం మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే 30 మంది దాకా ఎమ్మేల్యేలు శరత్ పవర్ కు వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తోంది. వారంతా కూడా అజిత్ పవర్ తో బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారట.

Also read: HarishRao:చేసుడు తక్కువ..గొప్పలు ఎక్కువ

ఇదే గనుక జరిగితే మరో పార్టీలో బీజేపీ కుంబటి పెట్టినట్లే. ఇటీవల శరత్ పవర్ బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో జోరు కనబరిచారు. దీంతో శరత్ పవర్ కు చెక్ పెట్టేందుకు ఏకంగా ఎన్సీపి ( NCP ) లోనే చీలిక తెచ్చి పార్టీకి కకావికలం చేయాలని బీజేపీ అధిష్టానం వ్యూహం పన్నినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలను అజిత్ పవర్ ఖనిదిస్తున్నప్పటికి ఈయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వీడే అవకాశం ఉందని ఎంతోకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే శివసేనలో ఏక్ నాథ్ షిండే ద్వార ఏవిధంగా పార్టీలో చీలిక తీసుకొచ్చారో అదే విధంగా ఎన్ సీ పి ( NCP ) లో కూడా అజిత్ పవర్ తో చీలిక తీసుకొచ్చే విధంగా బీజేపీ పన్నాగం పన్నుతున్నట్లు నేషనల్ పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -