KTR:హైదరాబాద్‌కు మరో ఎంఎన్‌సీ కంపెనీ…

51
- Advertisement -

హైదరాబాద్ అనేక రకాల భిన్న సంస్కృతుల సమ్మేళనమని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ప్రజలు అంతా తమ ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నారని స్పష్టం చేశారు. తాజాగా హైదరాబాద్‌ నాలెడ్జ్ సిటీలో గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్స్ సర్వీస్ సిట్‌కో కొత్త యూనిట్‌ను కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.

Also read: చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ సొంతం..

ఈ సందర్భంగా మాట్లాడుతూ… గడిచిన తొమ్మిందేండ్లలో సాంకేతిక రంగంలో ఉద్యోగుల సంఖ్య 3.25లక్షల నుండి 10లక్షలకు పెరిగిందని తెలిపారు. అర్థంలేని మాటలకు ద్వేషం హింసకు ఇక్కడ చోటు లేదన్నారు. లా అండ్ ఆర్డర్ కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు. మరీ ముఖ్యంగా విద్య, అకడమిక్, ఇన్నోవేషన్, పర్యావరణ వ్యవస్థలు పగడ్బందీగా ఉన్నాయ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

Also read: బీజేపీ ” షిండే ” వ్యూహం మళ్ళీ మొదలు!

ఇమేజ్ టవర్స్, యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా కోసం ఇక్కడ ఒక కేంద్రం నిర్మించబడుతోంద‌ని మంత్రి పేర్కొన్నారు. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అవుతుంది. దీనికి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యవాప్తంగా పెరొందిన కంపెనీలు హైదరాబాద్‌ వైపు వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పనిచేస్తున్నాయని తెలిపారు. సిట్‌కో కంపెనీ మనీలాలోనే కాకుండా హైదరాబాద్‌లో కూడా అతి పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -