బీజేపీ అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ. పార్టీ సోషల్ మీడియాలో బీజేపీ బత్తాయిలు అంటే కాషాయ కార్యకర్తలకు నెట్‌జన్లు పెట్టిన ముద్దు పేరు లెండి.. అడ్డగోలుగా అబద్దపు ప్రచారాలు చేసి , ప్రత్యర్థులపై బురద జల్లుతుంటారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్నికలలో విజయాలు సాధించడం బీజేపీ టెక్నిక్. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియాలో బీజేపీకి సీన్ రివర్స్ అవుతోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో నెట్‌జన్లు బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎదురైన ఘోరపరాజయం నుంచి తేరుకోకముందే సాగర్ ఉప ఎన్నికలు వచ్చిపడడంతో బండి సంజయ్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అయితే ఇక్కడ మెజారిటీ ఓట్లు ఉన్న గిరిజన సామాజికవర్గాన్నే బండి నమ్ముకున్నాడు.
అసలు గిరిజనుల కష్టాలను ఏనాడు పట్టించుకోని బీజేపీ గుర్రంబోడు వివాదాస్పద భూముల విషయంలో రచ్చ రచ్చ చేయడం వెనుక సాగర్ ఉప ఎన్నికలు ఉన్నాయని ఆప్పుడే అర్థమైంది. సాగర్ ఉప ఎన్నికలను దృష్టి పెట్టుకునే బండి సంజయ్ పక్కా ప్లాన్ ప్రకారం గుర్రంబోడులోని వివాదాస్పద గిరిజన భూముల ప్రాంతానికి వెళ్లి బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై రాళ్లదాడి చేయించాడు. ఈ రాళ్లదాడితో గిరిజనుల్లో బీజేపీ పట్ల సానుకూలత వచ్చిందని నమ్మిన బండి… సాగర్ ఉప ఎన్నికలలో నివేదితారెడ్డి, అంజయ్యయాదవ్‌లను పక్కనపెట్టి మరీ… ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రవినాయక్‌ను బరిలోకి దింపి లంబాడీల ఓట్లకు గాలం వేస్తున్నాడు. అయితే బండి సంజయ్ కుట్రలపై సోషల్ మీడియాలో నెట్‌జన్లు చెడుగుడు ఆడుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అదిలాబాద్ జిల్లాలో ఎస్టీ రిజర్వేష్ల విషయంలో ఆదివాసీలను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించిన బండి సంజయ్… పథకం ప్రకారం లంబాడీలపై దాడులను ప్రోత్సహించాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లంబాడీ సామాజికవర్గం బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే సాగర్ ఉప ఎన్నికలలో బండి సంజయ్ లంబాడీలకు బిస్కెట్ వేయడానికే అదే సామాజికవర్గానికి చెందిన రవినాయక్‌కు టికెట్ ఇచ్చాడు. ఓ పక్క గిరిజన హక్కుల చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తోంది. మరో పక్క బీజేపీ ఎంపీ సోయం బాపురావు లంబాడీలను ఎస్టీ సామాజికవర్గం నుంచి తొలగించాలంటూ ఆదివాసీ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లి మోదీకి వినతిపత్రం ఇస్తాడు. ఇక్కడ సాగర్‌లో మాత్రం లంబాడీల ఓట్ల కోసం రవినాయక్‌కు టికెట్ ఇచ్చింది.. దీంతో సోషల్ మీడియాలో నెట్‌జన్లు రకరకాల మీమ్స్‌తో బీజేపీ కుట్రలను చీల్చిచెండాడుతున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి, లంబాడీ సోదర,సోదరీమణులకు స్వయం పాలన అందిస్తే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓవైపు తమ పార్టీ ఎంపీ సోయంబాపురావుతో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని లేఖ ఇప్పిస్తాడు. .లంబాడా సోదర, సోదరీమణులు గిరిజన అభ్యర్థి పేరుతో బీజేపీ చేస్తున్న మోసాన్ని గ్రహించాలంటూ ఓ మీమ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.. ఇంకో మీమ్‌లో అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో వరుసగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీకి తన గుజరాతీ దోస్తులైన అంబానీలు, అదానీలు వంటి కార్పొరేట్లకు కట్టబెడుతున్న వైనంపై సుతిమెత్తని సెటైర్ వేశారు.బీజేపీకి ఓటేస్తే..సాగర్ డ్యామ్ అమ్మేసి..ఆ నీళ్లను మాతోనే కొనిపిస్తరు సారు అంటూ అదిరిపోయే మీమ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మొత్తంగా సెటైరికల్ మీమ్స్‌తో గిరిజన వ్యతిరేకి అయిన బీజేపీ బండారాన్ని బయటపెడుతూ నెట్‌జన్లు బండి సంజయ్‌ను ఓ రేంజ్‌లో ఏకిపారేస్తున్నరు.