రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని…మేమే గెలుస్తున్నాం అన్నారు మంత్రి కేటీఆర్. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్.కాంగ్రెస్ పార్టీ 1999 లో గెలుస్తామని సున్నాలు వేసుకున్నారు…మరి గెలిచారా? అని ప్రశ్నించారు. అభ్యర్థులను ముందే ప్రకటించిన పార్టీ బీ ఆర్ ఎస్…ప్రకటించిన తర్వత బీ ఫామ్ అందరికీ ఇస్తారా అని అడిగారు…95 శాతం బీ ఫామ్ అందరికీ ఇచ్చామని చెప్పారు.
మిగత పార్టీలు అభ్యర్థుల కోసం ఇబ్బందులు పడుతున్నారని…మేము చేసిన అభివృద్ది మమ్మల్ని గెలిపిస్తుందన్నారు. బిజెపి లో ఉన్న అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు అని…మాకున్న పోటీ కేవలం కాంగ్రెస్ పార్టీయే అన్నారు.
ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ముందుందని…ఇసుక మీద 30 కోట్లు ఆదాయం ఉమ్మడి రాష్ట్రం లో వచ్చింది కానీ తెలంగాణలో 5000 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మైక్ ఇవ్వగానే ఏది పడితే అది రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు…ఏ రంగం తీసుకున్న ఆనాడు అవినీతి లో కూరుకు పోయిందని చెప్పారు.
మెడికల్ కాలేజీలు 3 మాత్రమే పెట్టింది కాంగ్రెస్…మేము.33 మెడికల్ కాలేజీలు ఇచ్చాము అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో నత్తలు సిగ్గుపడేలా నీటి ప్రాజెక్టులు కట్టారు…రాహుల్ గాంధీ మళ్ళీ వచ్చినప్పుడు నిజాలు తెలుసుకొని రావాలన్నారు. తలసరి ఆదాయం లో నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ…కర్ణాటక లో కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని అక్కడి మంత్రి స్వయంగా చెప్పారన్నారు.
Also Read:KTR:119 స్థానాల్లో ఈటల పోటీ చేస్తారా?