KTR:119 స్థానాల్లో ఈటల పోటీ చేస్తారా?

50
- Advertisement -

119 నియోజకవర్గాల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్… కాంగ్రెస్ కు బీ ఆర్ ఎస్ బీ టీమ్ అనటం హాస్యాస్పదం అన్నారు. కాంగ్రెస్,బిజెపిది ఆలుమగల బంధం అని…శివసేన తో పెట్టుకొని సంసారం చేసింది కాంగ్రెస్ కాదా? అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ అభివృద్ది ఎక్కడ సాగుతోందని…స్పష్టమైన మెజారిటీ కచ్చితంగా మాకే వస్తుందన్నారు. ఖమ్మం లో నాయకులు పోయిన ఎక్కువ స్థానాలు మేమే గెలుస్తాం అన్నారు. మంథని, రామగుండం పోటాపోటీ ఫలితాలు ఉంటాయని..సర్వే రిపోర్ట్ చూసి ఆగం కావద్దు అన్నారు. మాకున్న సర్వే బాగుంది మాకు అనుకూలంగా ఉన్నాయని…మా నాయకుల మీద ఎక్కడ వ్యతిరేకత లేదు అన్నారు.

2018 లో కూడా ఇలాగే అన్నారు…చాలా చర్చించి ఆలోచనతో ఇప్పుడు మళ్లీ అభ్యర్థులను ప్రకటించాం అన్నారు. నల్లగొండ ను నంబర్ 1జిల్లా గా మార్చింది బీ ఆర్ ఎస్ ప్రభుత్వం అన్నారు. బిజెపి కేంద్రం మా మెడ మీద కత్తి పెట్టీ శత్రువు లాగా ట్రీట్ చేస్తుందని…మాకు వచ్చే నిధులు కేంద్రం ఆపుతుందన్నారు. మా ప్రభుత్వాన్ని ఆర్దికంగా దెబ్బ తీసే ప్రయత్నం కేంద్రం చేస్తోందన్నారు.

Also Read:బీఆర్ఎస్‌లోకి చెరుకు సుధాకర్..

మేము కూడా ఉద్యమ కారులమే…పోయిన ఉద్యమ కారులను మళ్ళీ మాట్లాడి పిలుపిస్తున్నం అన్నారు. అందుకే వచ్చి చేరుతున్నారు అన్నారు. Tspsc ద్వారా చాలా ఉద్యోగాలు నియామకం అయ్యాయని…ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పట్టించుకోవద్దు అన్నారు. ప్రవళిక చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు…మేము ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాం అన్నారు. ఆ అమ్మయిని వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు…హుజూరాబాద్ లో ఈటెల ఓడిపోతున్నారన్నారు. గజ్వేల్ లో పోటీ చేసిన ఈటెల గెలవరుని జోస్యం చెప్పారు. కేంద్రం లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది…అందులో ప్రాంతీయ పార్టీలు కీలకం అవుతాయన్నారు.

Also Read:తన బికినీకి వచ్చిన స్పందన నచ్చిందట

- Advertisement -