రాజాసింగ్‌ కామెంట్స్‌పై రచ్చ

181
rajasingh
- Advertisement -

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత జరిగిన ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయిందని , ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు సత్తా చాటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాషాయపెద్దల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా ప్రధాని మోదీ నిరంకుశ వైఖరిని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టడం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ థాక్రే సారథ్యంలో మరోసారి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడనున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. యుపీలో బీజేపీ ఓడిపోతుందని కేసీఆర్ తేల్చి చెప్పారు. కాగా గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యుపీ ఎన్నికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగికి ఓటు వేయకుంటే బుల్‌డోజర్లు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ రాజాసింగ్ ఓ వర్గం ప్రజలను టార్గెట్ చేస్తూ హెచ్చరించారు యూపీలో హిందువులంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. . యోగి అదిత్యనాథ్‌కు ఓటు వేయని ప్రాంతాలను గుర్తించి అక్కడికి జేసీబీలు, బుల్‌డోజర్లు పంపుతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

యూపీలో ఉండాలంటే యోగి అనాలి అని, లేకుంటే ఉత్తరప్రదేశ్‌ వదిలి పారిపోవాలని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లో యోగిబాబా ప్రభుత్వం రాబోతుందని రాజాసింగ్‌ అన్నారు. కాగా గతంలో కూడా యుపీలో బీజేపీకి ఓటేయని మైనారిటీ వర్గాల ప్రాంతాలపై కాషాయమూకలు దాడులకు పాల్పడ్డి నానా విధ్వంసం చేశాయి. ఈసారి యుపీలో తమ పార్టీ ఓడిపోయే స్థితిలో ఉండడంతో బీజేపీ నేతలు మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్లను ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యోగికి ఓటేయని ప్రాంతాలను గుర్తించి జేసీబీలు, బుల్‌డోజర్లతో కూలుస్తం అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. కాగా ఇప్పటికే యూపీలో యోగి పాలనపై అసంతృప్తి ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కమలనాథులకు తలనొప్పిగా మారాయి. ప్రతిపక్షాలు రాజాసింగ్ బెదిరింపులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రస్తుతం యుపీలో బీజేపీకి ఓటేయకపోతే మీ ప్రాంతాలకు జేసీబీ, బుల్‌డోజర్లు వస్తాయంటూ తెలంగాణ కాషాయ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు జాతీయవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

- Advertisement -