- Advertisement -
దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడికి యత్నించారు బీజేపీ కార్యకర్తలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతిపై దాడికి ప్రయత్నించారు.
దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి ఖాయమని తేలడంతో బీజేపీ పథకం ప్రకారమే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నదని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. బీజేపీ తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని…. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలనే లక్ష్యంతోనే తమపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.
క్రాంతి కిరణ్‌పై దాడిని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా వారిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు గాయలయ్యాయి.
- Advertisement -