తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీ తో జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మోడీ నియంత పరిపాలనకు చెక్ పెట్టి మతతత్వ బీజేపీ ని కేంద్రంలో గద్దె దించాలనే లక్ష్యంతో కేసిఆర్ నెషనల్ పాలిటిక్స్ పై దృష్టి సారించారు. అయితే కేసిఆర్ ఎప్పుడైతే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారో అప్పటి నుంచి కేంద్రప్రభుత్వం బిఆర్‌ఎస్ ను చిక్కుల్లో నెట్టే ప్రయత్నమే చేస్తోంది. కేంద్ర దత్త సంస్థలు గా ఉన్న ఈడీ, సిబిఐ లను ఉపయోగించి తమకు వ్యతిరేక పార్టీల నేతలపై ప్రయోగించే మోడీ అమిత్ షా ద్వయం.. బిఆర్‌ఎస్ వల్ల తమకు నష్టమే అని భావించి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కులుస్తామని, ఏక్ నాథ్ షిండే లను పుట్టిస్తామని చెబుతూ వస్తోంది. .
అయితే ఇలాంటి తాకాటు చప్పుళ్ళకు బయపడేది లేదని కేసిఆర్ చూపిన దైర్యనికి తోకముడిచింది బీజేపీ అధిస్థానం. అయినప్పటికి బిఆర్‌ఎస్ ను దెబ్బతీసే దౌర్జన్య ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు మోడీ అమిత్ షా ద్వయం. మునుగోడు ఎన్నికల నేపత్యంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి కేసిఆర్ ఇచ్చిన షాక్ తో చేతులు కాల్చుకుంది. ఇక ఇన్ని జరిగిన కుక్క తోక వంకర అంటూ డిల్లీ లిక్కర్ స్కామ్ ను కేసిఆర్ కూతురిపై అభియోగం మోపి రాజకీయంగా లభ్ది పొందేందుకు చూస్తోంది కాషాయ పార్టీ. అయితే ఇలాంటి నిరాధార అభియోగాలకు భయపడే ప్రసక్తే లేదని అటు కేసిఆర్ ఇటు ఆయన కూతురు కవిత డిల్లీ పెద్దల ఆరోపణలు తిప్పికొడుతున్నారు.
ఈ నేపథ్యంలో సిబిఐ విచారణ కూడా చేపట్టగా.. బిఆర్‌ఎస్ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా కవితకు అండగా నిలిచారు. ఇన్ని రకాలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను అలాగే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం.. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే అని కొందరి అభిప్రాయం. ఎందుకంటే కేసిఆర్ తెలంగాణ మోడల్ అభివృద్దిని జాతీయ స్థాయిలో విస్తరిస్తే.. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ప్రజల దృష్టి బిఆర్‌ఎస్ పై పడే అవకాశం ఉంది. ఆ భయంతోనే మోడీ షా ద్వయం కేసిఆర్ టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది. అయితే అలాంటి వ్యూహాలను చిత్తు చేయడం కేసిఆర్ చతురతకు నిదర్శనం. మొత్తానికి బిఆర్‌ఎస్ ఎంట్రీతో డిల్లీ పెద్దల కుసలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి..