మెర్సల్‌ ఎఫెక్ట్‌..విజయ్‌పై మతం రంగు..!

279
BJP leader says Vijay is Christian
- Advertisement -

తమిళనాట బీజేపీ నేతలు వర్సెస్ ‘మెర్సల్’ చిత్రంగా వివాదం నడుస్తోంది. ఈ సినిమాలో జీఎస్టీతోపాటు, డిజిటల్ ఇండియా లాంటి ప్రోగ్రాంలను విమర్శించేలా డైలాగులు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా రజనీకాంత్‌తో పాటు ఇతర తమిళ సినీ నటులు విజయ్ పక్షాన నిలబడుతున్నారు. దీంతో మెర్సల్ సినిమా వివాదం ముదిరిపాకాన పడింది. ఈ నేపథ్యంలో హీరో విజయ్‌కి మతం రంగుపులిమింది  బీజేపీ.

విజయ్ హిందువు కాదని  క్రిస్టియన్‌ అంటూ ఆ పార్టీ నేత రాజా ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు.  విజయ్ ఓటర్ ఐడీని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, విజయ్ మతం మార్చుకున్నాడని, దానికి నిదర్శనంగా సీ జోసెఫ్ విజయ్ అని పేరుందని ఆరోపించారు. దీనిపై విజయ్ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడ్ని జోసఫ్‌ విజయ్‌ అని సంబోధిస్తున్నారు…ఆ పేరులో తప్పేముంది? అని ప్రశ్నించారు.

BJP leader says Vijay is Christian
తన పేరు చంద్రశేఖర్‌ అని చెప్పిన ఆయన, తనది శివుడి పేరని తెలిపారు. విజయ్‌ క్రిస్టియనో లేక ముస్లిమో అదీ కాక హిందువో కాదని స్పష్టం చేశారు. విజయ్ ఒక మనిషి అని, అంతకుమించి భారతీయుడని కౌంటరిచ్చారు. విజయ్‌కి మతం రంగు పూయటంపై ఆయన ఫ్యాన్స్‌ ఫైరవుతున్నారు.   WeLoveJosephVijay హ్యాగ్‌ట్యాగ్‌తో విజయ్ అభిమానులు ట్వీట్లు చేయడం ప్రారంభించారు.

మరోవైపు మెర్సల్‌కు మద్దతిచ్చినందుకు హీరో విశాల్‌పై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే అధికారుల  దాడులపై భయపడేది లేదని విశాల్ స్పష్టం చేశారు. తన దగ్గర ప్రతి పైసాకి లెక్క ఉందని… రాజకీయాలు ముఖ్యం కాదని అన్నాడు. మెర్సెల్ సినిమా వివాదానికి పరిష్కారం కావాలని అన్నాడు.

BJP leader says Vijay is Christian

- Advertisement -