సినీ నటి ఖుష్బూకు తప్పిన ప్రమాదం!

277
khushbu
- Advertisement -

బీజేపీ నేత,సినీ నటి ఖుష్బూ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కడలూర్‌లో బీజేపీ నిర్వహిస్తున్న వేల్‌ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా మెల్వార్‌వతూర్‌ సమీపంలో ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. ఖుష్బూ ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఒకవైపు డోర్‌ పూర్తిగా ధ్వంసమైంది. ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ట్విట్టర్ ద్వారా తెలిపారు ఖుష్బూ. అభిమానుల ఆశీస్సులు, దేవుడి దయ వల్ల క్షేమంగా బయటడ్డానని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

- Advertisement -