ఫార్ములా రిపీట్.. ఫలితం రిపీట్ అయ్యేనా?

32
- Advertisement -

రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా ? గత ఎన్నికల్లో ఫాలో అయిన వ్యూహాన్నే బీజేపీ పెద్దలు మళ్ళీ రిపీట్ చేయనున్నారా ? అంటే అవుననే వాదన వినిపిస్తోంది. మరో రెండు లేదా మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసారి కూడా విజయం సాధించి మూడోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు కాషాయ పెద్దలు. అందులో భాగంగానే ఇప్పటి నుంచే పార్టీ స్థితిగతులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీలపై వ్యతిరేకత సానుకూలత వంటి అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు అంతర్గత సర్వేలు చేయిస్తోందట మోడీ షా ద్వయం. .

ఈ సర్వేలలో ప్రజా మద్దతు ఉన్నవారికే మళ్ళీ ఎంపీ టికెట్లు కేటాయించే ఆలోచనలో ఉన్నారట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీలలో ఎంతమందికి సీట్ల కేటాయింపు జరుగుతుందనేది ఆసక్తికరంగా మారిన ప్రశ్న. ఎందుకంటే 2019 ఎలక్షన్ టైమ్ లో దాదాపు 90 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలను మార్చింది అధిష్టానం. ఈసారి కూడా భారీగానే మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని టాక్. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి ఏకంగా 100 స్థానాల్లో సిట్టింగ్ లను మార్చేందుకు బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోందట. దీంతో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీలలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను మార్చడం వల్లే 303 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అందుకే ఈసారి సిట్టింగ్ ల విషయంలో ఖరాఖండీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి గత ఎన్నికల్లో సిట్టింగ్ ల మార్పుపై సక్సెస్ అయిన ఫార్ములా ఈ ఎన్నికల్లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Also Read:ప్రజాపాలన నిర్వహిస్తున్నాం:సీఎం రేవంత్

- Advertisement -