“40 శాతం కమిషన్ “..చిక్కుల్లో బీజేపీ !

62
- Advertisement -

కర్నాటక ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరగనున్నాయి. దాంతో ఆ రాష్ట్రంలో పోలిటికల్ హీట్ తారస్థాయికి చేరుకుంటుంది. గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ, జెడిఎస్ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు ఆ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి ఈ ప్రధాన పార్టీలు. అందులో భాగంగానే ప్రత్యర్థి పార్టీలపై విమర్శల వేడి ఆరోపణల ధాటి రెట్టింపు చేస్తూ దూకుడు పెంచుతున్నాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరు అనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్.. కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టేందుకు బీజేపీ, ఈ రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అంటూ విమర్శల ఘాటును పెంచుతున్నాయి.

మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు హస్తం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ పై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎమ్మేల్యేలు కూడా బహిరంగంగానే అవినీతికి పాల్పడుతూ ప్రజల నుంచి లంచాలు, భూకబ్జాలు చేస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీనినే కాంగ్రెస్ ప్రధాన విమర్శనాస్త్రంగా చేసుకుంది. మోస్ట్ కరెప్టెడ్ సర్కార్ బీజేపీ అంటూ ప్రజల్లో గట్టిగా నినదిస్తోంది. ప్రజల్లో కూడా ఇదే ఒపీనియన్ ఉండడంతో కాషాయ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇదే అదునుగా బీజేపీని ఇరుకున పెట్టేందుకు పలు రకాల స్కామ్ లను హస్తం పార్టీ బయటకు తీస్తోంది.

Also Read: BRS:కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం..

బీజేపీ ఎమ్మెల్యే కొడుకు 78 కోట్ల స్కామ్, పీఎస్ఐ రిక్రూట్మెంట్ లో 71 కోట్ల స్కామ్, కోవిడ్ 19 సామగ్రి కొనుగోలులో 32,200 కోట్ల స్కామ్ ఇలా అన్నిటిలోనూ బీజేపీ సర్కార్ అవినీతికి పాల్పడిందని, 40 కమిషన్ లేనిదే బీజేపీ సర్కార్ ఏ పని చేయడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే అంశాలను హస్తం పార్టీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో 40 శాతం కమిషన్ అంశం కర్నాటకలో హాట్ టాపిక్ అయింది. అటు బీజేపీ కూడా ఈ అంశాలపై మౌనం వహిస్తూ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఇలా మొత్తానికి బీజేపీపై ఉన్న అవినీతి ముద్ర ఆ పార్టీని ఇరకాటంలో పెడుతోంది.

Also Read: Harishrao:రాజ్యాంగంలో రాసుందా?

- Advertisement -