జూటా మాటలతో మోసం చేస్తున్న బీజేపీ నేతలు..!

200
modi
- Advertisement -

భారతీయ జనతా పార్టీని అంతా భారతీయ జూటా పార్టీ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపితమైంది. తాను మాటల మనిషే కాని..చేతల మనిషిని కాదని ప్రధాని మోదీ తనను తాను పదే పదే నిరూపించుకుంటున్నారు. 2014లో అధికారంలోకి రాగానే నల్లధనం వెనక్కి తీసుకువస్తా..పేదల అకౌంట్‌లో ఒక్కొక్కరికి రూ. 15 వేలు ఇస్తా…అని బడాయి మాటలు చెప్పారు. తీరా నల్లధనం వెనక్కి రాలేదు…కాని దేశాన్ని దోచుకున్న నల్లదొంగలు మాల్యా, నీరవ్ మోదీలను మన మోదీసార్ దేశం దాటించారు..తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ 40 రూపాయలకే అందిస్తామని కాషాయ నేతలు కబుర్లు చెప్పారు.

ఆరున్నరేళ్లలో పెట్రోల్ ధరను సెంచరీ కొట్టించి గ్రౌండ్‌లో సెంచరీ కొట్టిన కోహ్లిలా రెండు చేతులు ఎత్తేసిన మన మోదీ సార్‌ను చూస్తే దేశ ప్రజలు మీకో దండం సారూ అంటున్నారు. పైగా పెట్రోల్ ధర సెంచరీ కొట్టడం వెనుక గత కాంగ్రెస్ పాలకులు ముడిచమురు దిగుమతులను తగ్గించుకోకపోవడమే అంటూ మోదీ సార్ సెలవిచ్చారు చూడండి..ఆహా..మోదీ సార్ నటనా చాతుర్యానికి ఆస్కార్ కూడా తక్కువే. తాజాగా దేశమంతా అమలు చేయలేని హామీని పశ్చిమబెంగాల్‌ అమలు చేస్తానంటూ మోదీ, షా బ్యాచ్ బెంగాల్‌ ప్రజలకు బిస్కెట్లు వేస్తోంది. పశ్చిమ బెంగాల్‌ను బంగారు బెంగాల్ చేస్తారంట..తెలంగాణ సీఎం కేసీఆర్ స్కీమ్‌లనే కాదు..ఆయన లక్ష్యాలను కూడా కమలనాథులు కాపీ కొడుతున్నారు. మమతా దీదీ పాలనలో మగ్గిపోతున్న బెంగాల్‌కు విముక్తి కలిగిస్తారంట..బెంగాల్‌లో మార్పు తీసుకువస్తామని అమిత్‌షా సార్ బెంగాల్ ప్రజలకు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తారంట.. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం ప్రయోజనాలు కల్పిస్తారంట..ఇలా అమిత్‌షా ఓట్ల కోసం బెంగాల్ ప్రజలకు బిస్కెట్లు మీద బిస్కెట్లు వేశారు.

ముఖ్యంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీ ఉంది చూశారు…విన్నోళ్లకు ప్యూజులు ఎగిరిపోయాయంటే నమ్మండి.. బెంగాల్‌లో అధికారంలోకి వస్తే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతున్న మోదీ, షాలు కేంద్రంలో దాదాపు ఏడేళ్లుగా అధికారంలో ఉంటున్నారు..ఇప్పటి వరకు ఈ మహిళల రిజర్వేషన్లు వారికి గుర్తు లేదు. పార్లమెంట్‌లో ఎన్నిసార్లు బిల్లు వచ్చినా ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారు. తనది 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకునే మన మోదీ సార్ దేశంలోని 50 శాతం ఉన్న మహిళా జనాభా కోసం 33 శాతం రిజర్వేషన్లను తీసుకువచ్చే సాహసం ఎందుకు చేయడం లేదు.. చట్టాలు చేసే సభలో మహిళల సంఖ్య పది శాతం కూడా లేకపోవడం నిజంగా సిగ్గు చేటు..నిజానికి యుపీఏ హ‍యాంలో మహిళలకు రిజర్వేషన్లు బిల్లును తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2010 మార్చి, 9న కేంద్ర, రాష్ట్రాల చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ కల్పించే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. 15 ఏళ్ల పాటూ ఈ చట్టం అమలులో ఉన్న తర్వాత మహిళా రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న నిబంధనను బిల్లు ముసాయిదాలో చేర్చారు.

అయితే 2014లో అధికారంలోకి వచ్చిన మన ఘనత వహించిన మోదీ సార్ ఏడేళ్లు అయినా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే ప్రయత్నం చేయలేదు…ఇప్పుడు బెంగాల్‌లో ఓ మహిళా నేత అయిన మమతాబెనర్జీని ఓడించడానికి నిస్సిగ్గుగా ఆ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను లాక్కుంది కాకుండా..ఏకంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ..మరోసారి మోసం చేస్తున్నారు. ఏడేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును చెత్తబుట్టలో పడేసిన మళ్లీ ఓట్ల కోసం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇవ్వడం నిజంగా సిగ్గు చేటు. కేంద్రంలో ఒకలా..రాష్ట్రాలలో మరోలా మాయమాటలు చెబుతూ దేశప్రజలను దగా చేస్తున్న కమలం పార్టీ నేతలు విశ్వసనీయత కోల్పోయారనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ నేతలు తమది భారతీయ జూటా పార్టీ అని మరోసారి చాటుకున్నారు.

- Advertisement -