భారత్ – చైనా అధికారుల సమావేశం..!

54
india

ఇండో చైనా బార్డర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి రప్పించే ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు ఇరుదేశాల సైనిక అధికారులు సమావేశం కానున్నారు.

ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మాల్డో పోస్టు వద్ద సీనియర్‌ కమాండర్‌ స్థాయి అధికారులు సమావేశమవనున్నారు. సరిహద్దుల్లోని మరిన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ,దేశ్‌పాంగ్‌, హాట్‌ స్ప్రింగ్స్‌, గోర్గాలో బలగాల వెనక్కితీసుకునే అంశం చర్చకు రానుంది.

గతేడాది జూన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో.. 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ ఘటనలో చైనా సైనికులు కూడా 40 మందికి పైగా చనిపోయినట్టు రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ తెలపగా చైనా మాత్రం కేవలం 5 గురు మాత్రమే చనిపోయారని వారి పేర్లతో సహా వెల్లడించింది.