బీజేపీ…బకాసురుల పార్టీ!

5
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడంపై శివసేన (UBT) నేత, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు “బకాసురుల పార్టీ”గా మారిపోయిందని, ఏ పార్టీ నేతనైనా మింగేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

పురాణాల్లోని బకాసురుడు ఎలాగైతే కంటికి కనిపించిన దేన్నైనా తినేస్తాడో, బీజేపీ కూడా అలాగే ఇతర పార్టీల నేతలను, పార్టీలను తనలో కలిపేసుకుంటోందని రౌత్ విమర్శించారు.బీజేపీకి ఎలాంటి నైతిక విలువలు లేవని, కేవలం అధికారం కోసం ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు ఎంతకైనా తెగిస్తారని ఆయన ఆరోపించారు.

రాఘవ్ చద్దా వంటి యువ నేతలు బీజేపీలో చేరడాన్ని ప్రస్తావిస్తూ.. ఒత్తిడికి గురయ్యో లేదా స్వార్థం కోసమో నేతలు పార్టీలు మారుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు.గతంలో శివసేన మరియు ఎన్సీపీలను చీల్చిన విధానాన్నే ఇప్పుడు ఏఏపీ విషయంలో కూడా బీజేపీ అమలు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ ఇప్పుడు ఇతర పార్టీల నుండి వచ్చే ఎవరినైనా స్వీకరిస్తోంది. వారికి సిద్ధాంతాలతో పనిలేదు, కేవలం సంఖ్యాబలం మరియు ఆధిపత్యం మాత్రమే ముఖ్యం. వారు రాజకీయాల్లో ఒక బకాసురుడిలా ప్రవర్తిస్తున్నారు అని విమర్శించారు సంజయ్ రౌత్. ఈ ఫిరాయింపుల వల్ల ప్రతిపక్షాలు బలహీనపడబోవని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని రౌత్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read:కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు హైకోర్టులో రిలీఫ్

- Advertisement -