బీజేపీకి ఫండ్స్‌…ఎన్నివందల కోట్లో తెలుసా..?

46
bjp

2019-20 సంవత్సరానికి గానూ వివిధ పార్టీలకు వచ్చిన విరాళాలను వెల్లడించింది ఈసీఐ. అత్యధికంగా బీజేపీకి 785.77 కోట్లు విరాళాలు రాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం వచ్చే విరాళాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఫిబ్ర‌వ‌రి 12నే ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించినా.. ఈసీఐ

మాత్రం మంగ‌ళ‌వారం వివరాలను వెల్లడించింది. ఏడాదిలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ విరాళాలు రావ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ రూ.139.01 కోట్లు విరాళాలుగా రాగా తృణ‌మూల్ కాంగ్రెస్ రూ.8.08 కోట్లు,సీపీఐ రూ.1.29 కోట్లు అందుకున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘానికి తెలిపాయి. ఇక సీపీఎంకు రూ.19.69 కోట్లు, ఎన్సీపీకి రూ.59.94 కోట్లు వచ్చినట్లు ఈసీఐ తెలిపింది. మొత్తం విరాళాల్లో రూ.217.75 కోట్లు ప్రూడెంట్ ఎల‌క్టోర‌ల్ ట్ర‌స్ట్ నుంచి వ‌చ్చాయి.