సూర్యగ్రహణం..మనదేశంలో కనిపించేది ఎక్కడో తెలుసా..?

35
surya

నేడు సూర్యగ్రహణం. ఇవాళ మధ్యాహ్నం 01.42 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభంకానుండగా సాయంత్రం 6.41 గంటలకు గ్రహణం పూర్తిగా ముగియనుంది. దేశంలో పాక్షికంగానే సూర్యగ్రహణం కనిపించనుండగా 2021లో సంభవించనున్న మొదటి సూర్యగ్రహణం. వైశాఖ మాసం కృష్ణ పక్షం అమవాస్య రోజు సంభవించనున్న ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా కనిపించనుంది.

వలయాకారం లేదా కంకణ సూర్యగ్రహణం మధ్యాహ్నం 02.30 గంటలకు ఆరంభంకానుండగా గ్రహణం మధ్య కాలం 04.12 గంటలకు వరకు ఉంటుంది. వలయాకార సూర్యగ్రహణం సాయంత్రం 05.03 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 06.41 గంటల వరకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది.

ఇక దేశంలో ఈశాన్య ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు లడఖ్‌లో కనిపించనుంది. ప్రపంచవ్యాప్తంగా రష్యా, కెనడా, గ్రీన్ లాండ్ దేశాల్లో సంపూర్ణంగా వీక్షించవచ్చు.