ప్రజలే బుద్ధి చెబుతారు: దీదీ

65
mamatha
- Advertisement -

అధికార మదంతో ప్రజా ప్రభుత్వాలను కూల్చుతున్న మోదీని రానున్న ఎన్నికల్లో ప్రజలే కూల్చివేస్తారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి దీదీ హెచ్చరించారు. ప్రధాని మోదీ సారధ్యంలోని కేంద్రప్రభుత్వంపై సోమవారం దీదీ మండిపడ్డారు.

మహారాష్ట్రలో అప్రజాస్వామికంగా ఠాక్రే సర్కార్ ను కూల్చవేశారని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా ప్రభుత్వాలను గద్దెదింపుతున్నారన్నారు. మహారాష్ట్రలో ప్రజల హృదయాలను వారు ఎప్పటికి గెలవలేరని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.


భవిష్యత్‌లో కాషాయ పార్టీని ప్రజలే ఇంటికి పంపిస్తారన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేనదని ఓ వార్తా చానెల్‌తో మాట్లాడుతూ దీదీ వ్యాఖ్యానించారు.

- Advertisement -