బిహార్‌లోనూ మహా తరహా స్కెచ్‌!

37
- Advertisement -

ఎవరూ ఊహించని విధంగా మహారాష్ట్రలో అధికార బీజేపీ పక్షాన చేరారు ఎన్సీపీ మెజార్టీ ఎమ్మెల్యేలు. అజిత్ పవార్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు బీజేపీకి జై కొట్టగా అజిత్ ఉప ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కూడా చేశారు. తాజాగా ఇప్పుడు ఇదే ఫార్ములాను బిహార్‌లోనూ అమలుచేసేందుకు సిద్ధమవుతోంది బీజేపీ.

గత ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కలిపి పోటీచేసి అధికారంలోకి రాగా ఏడాది గడవకముందే బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు సీఎం నితీశ్ కుమార్. అప్పటినుండి బిహార్‌పై దృష్టిసారించిన బీజేపీ…జేడీయూలో చీలిక విషయంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.

Also Read:ఓటీటీ : ఈ వారం కంటెంట్ ఇదే

ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ సింగ్ స్వయంగా వెల్లడించారు. పలువురు జేడీయూ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని అలాగే ఆర్జేడీ ఎమ్మెల్యేలు సైతం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. దీంతో దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు నితీశ్. తమ పార్టీ ఎమ్మెల్యేలతో వ్యక్తిగత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా తాజాగా బిహార్‌పై బీజేపీ ఫోకస్ పెట్టడం అందరిలో ఆసక్తిరేపుతోంది.

Also Read:Worldcup:సెకండ్ ‘బెర్త్‌’ ఎవరికి?

- Advertisement -