ఓటీటీ : ఈ వారం కంటెంట్ ఇదే

31
- Advertisement -

ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఏకంగా థియేటర్లలో 10 చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఐతే, ఈ పది చిత్రాల్లో నాగశౌర్య రంగబలి పై మాత్రమే అంచనాలు ఉన్నాయి. శ్రీసింహా కోడూరి భాగ్‌ సాలే సినిమా పై కూడా కాస్త బజ్ ఉంది. జగపతిబాబు ‘రుద్రంగి’ ఈ నెల 07వ తేదీనే వస్తోంది. అదే విధంగా అర్జున్‌, జేడీ చక్రవర్తి ఇద్దరు సినిమా కూడా పోటీలో ఉంది. ఈ సినిమాలు కాకుండా సర్కిల్‌, ఓ సాథియా, మోహన్‌కృష్ణ గ్యాంగ్‌లీడర్‌, నాతో నేను వంటి చిత్రాలు కూడా రేసులో ఉన్నాయి.

ఓ వైపు పది సినిమాలు వరుసగా థియేటర్‌లో సందడి చేసేందుకు సన్నద్ధం అవుతున్నా.. ఈ వారం కూడా ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ కంటెంట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

Also Read:NBK 109:లేటెస్ట్ అప్‌డేట్

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌)జులై 7 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డీప్‌ పేక్‌ లవ్‌ (రియాల్టీ షో) జులై 7 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారాలు ఇవే :

బాబీలోన్‌ (హాలీవుడ్‌) జులై 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

స్వీట్‌ కారం కాఫీ (తెలుగు సిరీస్‌) జులై 6 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అదూరా (హిందీ సిరీస్‌) జులై 7 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:వాము వాటర్‌తో ప్రయోజనాలు..

జీ 5 లో ప్రసారాలు ఇవే :

తర్‌లా (హిందీ) జులై 7 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డీస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

గుడ్‌నైట్‌ (తమిళ చిత్రం) జులై 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఐబీ 71 (హిందీ) జులై 7 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :

ఫర్హానా (తమిళ/తెలుగు) జులై 7 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జియో సినిమా లో ప్రసారాలు ఇవే :

ఇష్క్‌ నెక్ట్స్‌ డోర్‌ (హిందీ) జులై 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బ్లైండ్‌ (హిందీ) జులై 7వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:Worldcup:సెకండ్ ‘బెర్త్‌’ ఎవరికి?

- Advertisement -