ఎన్సీపీ నాశనం.. బీజేపీ కుట్రే!

38
- Advertisement -

ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయినటువంటి ఎన్సీపీ నుంచి 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్.. శివసేన షిండే వర్గంలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. అనుకోని ఈ షాక్ తో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఎన్సీపీ అధినేత శరత్ పవార్ తనయుడే పార్టీలో ఇలా చీలిక తీసుకురావడం ఆ పార్టీ జీర్ణించుకోలేక పోతుంది. .

అయితే సేమ్ ఇలాంటి పరిణామలే గతంలో శివసేన పార్టీలో చోటు చేసుకున్నా సంగతి విధితమే. శివసేన పార్టీ తరుపున అధికారంలో ఉన్న ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చి ఏక్ నాథ్ షిండే బీజేపీ సహాయంతో అధికారాన్ని చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విధంగా శివసేనలో ఏక్ నాథ్ షిండే ద్వారా చీలిక తీసుకురావడం వెనుక బీజేపీ పెద్దల అస్త్రశాస్త్రాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు అదే విధంగా ఎన్సీపీలో కూడా చీలిక ఏర్పడడం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్రను గుప్పిట్లో ఉంచుకునేందుకు అక్కడి పెద్ద పార్టీలను బీజేపీ నిర్వీర్యం చేస్తున్నట్లు తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమౌతోంది.

Also Read:నేను డౌటే.. బండి హింట్ ఇచ్చాడా?

ఒకప్పుడు రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేన ఇప్పుడు థాక్రే వర్గం మరియు షిండే వర్గం అంటూ రెండుగా విడిపోయింది. ఫలితంగా శివసేన ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అదే విధంగా ఎన్సీపీలో కూడా అజిత్ పవార్ ను పాచికలా వాడుకొని పార్టీని రెండుగా చిల్చింది. ఎన్సీపీ అధినేత శరత్ పవార్ కూడా అదే విషయాన్ని వ్యక్తం చేశారు. అన్నీ పార్టీలను బీజేపీ విచ్చిన్నం చేస్తోందని, ఎన్సీపీని నాశనం చేసిన వారికి తగిన బుద్ది చెబుతామని శరత్ పవార్ హెచ్చరించారు. మొత్తానికి మహారాష్ట్రను పూర్తిగా గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు బీజేపీ పన్నిన వ్యూహాలు గట్టిగానే సక్సస్ అయినట్లే కనిపిస్తోంది.

Also Read:బీజేపీని గద్దె దించడమే లక్ష్యం:అఖిలేష్

- Advertisement -