రాజకీయాలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన: నితిన్‌ గడ్కరీ

51
nitin
- Advertisement -

ఇటీవలే బీజేపీ పార్లమెంటరీ బోర్డ్‌లో చోటు కోల్పోయిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే ఆద్వాణీ దీన్‌దయాళ్‌ ఉపాద్యాయ వంటి అగ్ర నేతల కృషి వల్లే బీజేపీ కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. నాగ్‌పుర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1980లో బీజేపీ ముంబాయిలో నిర్వహించిన సదస్సులో వాజ్‌పేయీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏదో ఒక రోజు చీకటి తొలగిపోతుంది. సూర్యుడు బయటికొస్తాడు. కమలం వికసిస్తుంది అని అటల్‌ జీ ఆ రోజు వ్యాఖ్యానించారన్నారు. ఈ సదస్సులో నేను కూడా ఉన్నాని అన్నారు. నాడు వాజ్‌పేయీ ప్రసంగాన్ని విన్నవారంతా అలాంటి ఒక రోజు వస్తుందని విశ్వసించారు.

ఆరెస్సెస్‌ సిద్దాంతకర్త దివంగత దత్తోపంత్‌ ఠెంగడీ గతంలో చేసిన వ్యాఖ్యాలను గుర్తుచేశారు. రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తారు. దేశాన్ని సమాజాన్ని నిర్మించాలనుకునే సమాజ ఆర్థిక సంస్కర్తలు మాత్రం చాలా ముందు చూపుతో వచ్చే శతాబ్ధం గురించి కూడా ఆలోచిస్తారు. ఈ విషయాన్ని ఠెంగడీ పదేపదే చెబుతుండేవారు అని వ్యాఖ్యానించారు.

అటల్‌, ఆద్వాణీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఇంకా మరెందరో కార్యకర్తలు విశేషంగా కృషి చేయడం వల్లే మనం ఇప్పుడు మోదీ నాయకత్వంలో అధికారంలో ఉన్నాం అని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారమే కేంద్రంగా రాజకీయాలు సాగుతున్న తీరుపై కూడా ఆయన పరోక్షంగా స్పందించారు. బీజేపీలోని పార్లమెంటరీ బోర్డ్‌లో చోటు కోల్పోవడంతో ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధన్యతను సంతరించుకున్నాయని పలువురి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -