మా ట్రోల్స్‌ ఎవ్వరిని వదలవు..!

22
god
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా… చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పోలిటీకల్‌ యాక్షన్ మూవీగా గాడ్‌ఫాదర్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఇప్పుడు ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సెట్టు చేసింది. కానీ అంతే రేంజులో అదే ట్రెండ్‌లో ట్రోల్స్‌ కూడా నడుస్తున్నాయి. తాజాగా చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌ మూవీకి తమన్‌ సంగీతం అందించారు. అందరి అంచానాల నడమే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉంటుందని ప్రేక్షకులు ఉహించారు. ఆఖండ తర్వాత అంతటి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వస్తదని ఉహించుకున్నారు. కానీ వరుణ్‌తేజ్‌ నటించిన గని మూవీ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను గాడ్‌ఫాదర్‌లో వాడారు. గని థీమ్‌ను మిక్స్‌ చేసి తమన్‌ గాడ్‌ఫాదర్‌కు పెట్టేశాడంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇక గాడ్‌ఫాదర్‌ మూవీ దాదాపుగా పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా కానుకగా ఆక్టోబరు 5న ఈ చిత్రాన్ని తీసుకు వస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు చేశారు. బాలీవుడ్‌ సల్మాన్‌ఖాన్‌ కూడా ఈ సినిమాలో కీ రోల్‌ చేశారు. బాక్సాఫీస్‌ దగ్గర గాడ్‌ఫాదర్‌ ఎంత వరకు షేక్‌ చేస్తదో… దసరా వరకు వేయిట్‌ చేయక తప్పదు.

- Advertisement -