బిగ్ బాస్ 4లో బిత్తిరి సత్తి..!

408
bithiri sathi
- Advertisement -

తెలంగాణ యాసతో విలక్షణమైన హావభావాలను పలికిస్తూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన యాంకర్ బిత్తిరిసత్తి ఉరఫ్ రవికుమార్‌. వీ6లో జర్నలిజం ప్రస్దానం మొదలుపెట్టిన బిత్తిరి సత్తి తర్వాత ఇస్మార్ట్ న్యూస్‌తో టీవీ9లో ఎంట్రీ ఇచ్చాడు.

అయితే తాజాగా బిత్తిరి సత్తికి ఉహించని షాక్ తగిలింది. టీవీ9 నుంచి ఆయన్ని తొలగిస్తూ యాజమాన్యం మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఇప్పుడు ఈవార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే తాజాగా బిత్తిరి సత్తికి సంబంధించి మరో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. త్వరలో ప్రారంభంకానున్న బిగ్ బాస్ 4లో బిత్తిరి సత్తి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. తద్వారా బిగ్ బాస్‌ 4కి మంచి రేటింగ్ రావడంతో పాటు ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. ఇప్పుడు ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బిగ్ బాస్‌ 3లో యాంకర్ సావిత్రి పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడే బిత్తిరి సత్తి కూడా బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చాయి.అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలిపోగా తాజాగా మరోసారి సత్తి బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త హల్ చల్‌గా మారింది. పుకార్లు షీకార్ చేస్తున్నాయి.

- Advertisement -