బీఆర్ఎస్‌లో చేరిన సోమశేఖర్,బిత్తిరి సత్తి

65
- Advertisement -

తెలంగాణ భవన్ వేదికగా మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన టిపిసిసి మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష, రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి), పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. గులాబి కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికారు.

కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు అని…రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా, బలహీనమైన నాయకత్వం ఉండాలా ఆలోచించాలన్నారు.ఇటువైపు బలమైన కేసీఆర్ ఉన్నడు, అవతలి వైపు ఎవరు ఉన్నారన్నారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అన్నారు. కెసిఆర్ రైతుల ఎజెండా అయితే, వారిది బూతుల ఎజెండా అన్నారు.

బూతులు మాట్లాడటం చాలా సులువు, కానీ నీళ్ళు ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, అంబేడ్కర్ విగ్రహం కట్టడం కష్టం అని..బూతులు మాట్లాడేవాళ్ళు కాదు భవిష్యత్ నిర్మించే వాళ్ళు కావాలన్నారు.ఒకవైపు ఐటి పరిశ్రమలు, మరో వైపు వ్యవసాయం అభివ్రుది చేసింది కేసీఆర్..నేడు నీళ్ళ కష్టం లేదు, కరెంట్ కోతలు లేవు అన్నారు.నాడు హైదారాబాద్ లో కరెంట్ కావాలని పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారు..24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్నది కేసీఆర్
కరువు లేదు, కర్ఫ్యూ లేదు ఇక్కడ అన్నారు.

హీరో సన్నీ డియోల్ వచ్చి ఇక్కడ అభివ్రుది గురించి ఆశ్చర్య పోయారు…సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హైదరాబాద్ న్యూ యార్క్ లెక్క అభివృద్ధి చెందింది అన్నడు అన్నారు. పక్కన ఉన్న రజీనీలకు అర్థం అవుతున్నది, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు అర్థం కావడం లేదు..మళ్ళీ కెసిఆర్ రాకుంటే బిజినెస్ అవుట్ అని భయ పడుతున్నారట…అమరావతి లెక్క హైదరాబాద్ అవుతుంది అని రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటున్నారన్నారు.ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్ గిరి.. సహా హైదరాబాద్ అన్ని నియోజకవర్గాలు గెలిపించాలన్నారు.

Also Read:Kavitha:సీఎం కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తి

- Advertisement -